రానా హోస్ట్‌ చేస్తున్న ‘నెం.1 యారి’ రెండో సీజన్ కార్యక్రమం ప్రారంభం అయింది. ఈసీజన్ తొలి ఎపిసోడ్ కు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో పాటు యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ లు కలిసి పాల్గొన్నారు. వీరిద్దరితో రానా అనేక ఆసక్తికర ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడుతూ మధ్యలో విజయ్ దేవరకొండ వర్జిన్ స్టేటస్ పై తన అనుమానాలు వ్యక్తంచేసి ఈషో చూస్తున్న వారు అందరికీ ఆనందాన్ని పంచాడు.
విజయ్ దేవరకొండ వర్జినా?
‘ఫస్ట్ కిస్’ ఎక్స్‌ పీరియన్స్ గురించి చెప్పాలని విజయ్ దేవరకొండను రానా అడిగినప్పుడు తాను చిన్నతనం నుండి బాయ్స్ హాస్టల్‍‌లో పెరగడం వల్ల పదోతరగతి వరకు తనజీవితంలో అమ్మాయిలు లేరు అంటూ ఒకవిధంగా తనకు అమ్మాయిలు అంటే తన చిన్నతనంలో చాలభయం ఉండేది అంటూ కామెంట్స్ చేసాడు విజయ్ దేవరకొండ. అయితే తన 19ఏళ్ల వయసులో తొలిముద్దు రుచి చూశాను అంటూ విజయ్ దేవరకొండ చెప్పగానే రానా నవ్వుతూ 19 ఏళ్లకే ముద్దుపెట్టుకున్నాడు అంటే విజయ్ వర్జిన్ కాడు అంటూ రానా వేసిన సెటైర్ ఆషోకు హైలెట్ గా మారింది. 
నిక్ నేమ్
అయితే విజయ్ రానాకు మరొక ట్విస్ట్ ఇస్తూ తాను కేవలం ముద్దు మాత్రమే పెట్టుకున్నానని తాను ఇప్పటికీ వర్జిన్ అంటూ కామెంట్స్ చేయడంతో రానా విజయ్ ను టార్గెట్ చేస్తూ విపరీతంగా నవ్వాడు. ఇదేసందర్భంలో రానా మాట్లాడుతూ తనకు దర్శకుడు నాగ్ అశ్విన్ 1వ తరగతి నుంచి క్లాస్‌మేట్స్ అని అంటూ పదవ తరగతిలో తాను ఫెయిల్ అవ్వడంతో తన క్లాస్ మేట్స్ అంతా ముందుకు వెళ్ళిపోయినా ఆ 10వ తరగతి పాస్ కావడానికి తనపాట్లు తాను పడ్డాను అంటూ తనపై తానే సెటైర్ వేసుకున్నాడు రానా.
నా బయోపిక్ తీస్తే టైటిల్
ఇదే ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ రానా ద్వారా మరొక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఒకసారి తన అంకుల్ పెళ్లిలో తాను తన ఫ్రెండ్స్ తాగేసి చేసిన హడావిడి గురించి మాట్లాడుతూ ఆ పెళ్ళికి వచ్చిన ఖరీదైన కార్లను చూసి తనకు డబ్బు ఉన్న వాళ్ళ పట్ల జెలసీ వచ్చి తాగిన మత్తులో ఖరీదైన కారు మీద పిస్ కొట్టాను అని విజయ్ దేవరకొండ తన చిలిపి చేష్టలను కూడ గుర్తుకు చేసుకున్నాడు. ఏమైనా విజయ్ తాను ఇప్పటికీ వర్జిన్ అని చెపుతూ ఉండటం ఎంతమంది నమ్ముతారో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: