మంచి ఫాం లో ఉన్నప్పుడు ప్రయోగాలు చేయకూడదు.. అసలు ఫాంలో లేనప్పుడు ప్రయోగాల జోలికి వెళ్లకూడదు ఇది ప్రస్తుతం సినిమా పరిశ్రమ పాటిస్తున్న సూత్రం. అయితే కంటెంట్ బాగుండాలే కాని ఫాంతో పనిలేదు అన్నది కొందరు అనే మాట. ఏది ఎలా ఉన్నా డిఫరెంట్ సబ్జెక్ట్ తో ప్రయత్నాలు చేసే హీరోలు తక్కువే.


యువ హీరోలు కూడా ఈమధ్య ప్రయోగాల బాట పట్టాగా కొందరు మాత్రం రొటీన్ గానే సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిలో చెప్పుకోవాల్సి వస్తే ఎనర్జిటిక్ స్టార్ రామ్ ముందు ఉంటాడు. మూసకథలతో సినిమాలు చేస్తున్నాడని వార్తలు తన దాకా వచ్చాయని నేను శైలజా సినిమాతో కొత్తగా కనిపించి హిట్ అందుకున్న రామ్ ఆ తర్వాత మళ్లీ హైపర్ అంటూ రొటీన్ కథతో వచ్చాడు.


ఆ సినిమా నిరాశ పరచగ ఆ తర్వాత వచ్చిన ఉన్నది ఒకటే జిందగి సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా హలో గురు ప్రేమకోసమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రామ్. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చూసిన వారు మరోసారి రామ్ అదే మిస్టేక్ చేశాడని అంటున్నారు.


నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో వచ్చిన హలో గురు ప్రేమకోసమే సినిమా రొటీన్ కథ కథనాలతో వచ్చింది. డైలాగ్స్ వర్క్ అవుట్ అయినా సినిమాలో పెద్దగా మ్యాటర్ ఏం లేదని అంటున్నారు. మరి అలా అయితే రామ్ ఈ సినిమా చేయడం కూడా మరో మిస్టేక్ అని అంటున్నారు. హలో గురు ప్రేమకోసమే అసలు టాక్ ఏంటన్నది ఈరోజు సాయంత్రం కల్లా తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: