కొన్ని కాంబినేషన్స్ ఎంత క్రేజీగా అనిపించినా ఆ సినిమాల ఫలితాలు మాత్రం నిరాశపరుస్తాయి. బడా నిర్మాత దిల్ రాజు యువ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ కలిసి చేస్తే ఆ సినిమా ఫట్ అనే సెంటిమెంట్ ఉంది. అదెలా అంటే ఆల్రెడీ హరే రామా హరే కృష్ణ సినిమా ఈ కాంబినేషన్ లో వచ్చిందే.


భారీ అంచనాలతో వచ్చిన హరే రామా హరే కృష్ణ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో రామ్ సినిమా చేయలేదు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా రామ్ హీరోగా చేయాల్సి ఉండగా ఆ సినిమా విషయంలో రామ్ వెనక్కి తగ్గడంతో రవితేజ ఆ సినిమా చేసి హిట్ కొట్టాడు.


ఇలా రామ్, రాజుల కాంబినేషన్ బ్యాడ్ సెంటిమెంట్ క్రియేట్ చేయగా తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా హలో గురు ప్రేమ కోసమే పై ఈ సెంటిమెంట్ ఎంతమేరకు పడుతుందో అని ఆలోచిస్తున్నారు. ఈమధ్య వరుస సినిమాలు ఫ్లాప్ అవడంతో హలో గురు ప్రేమ కోసమే సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు నిర్మాత దిల్ రాజు. 


మరి పోటీగా అరవింద సమేత ఉంది.. ఈరోజు పందెం కోడి-2 కూడా రిలీజ్ అవుతుంది. మరి ఈ రేసులో ప్రేమ కోసం ప్రాకులాడే ఈ కుర్రాడు విజయం సాధిస్తాడా లేదా అన్నది చూడాలి. సినిమా హిట్ అయితే దిల్ రాజు, రాం ల బ్యాడ్ సెంటిమెంట్ కు మంగళం పాడేసినట్టే. 



మరింత సమాచారం తెలుసుకోండి: