‘బాహుబలి’ తో నేషనల్ సెలిబ్రిటీగా మారిపోయిన  ప్రభాస్ మీడియాకు అదేవిధంగా ప్రచారానికి చాలా దూరంగా ఉంటాడు.  ‘సాహో’ తో పాటు దర్శకుడు రాధాకృష్ణతో మరో సినిమా చేస్తూ ప్రస్తుతం ఇటలీలో బిజీగా ఉన్న ప్రభాస్ నిన్న దసరా పండుగరోజున తన ఫేస్ బుక్ లో అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనెల 23 తన పుట్టినరోజున ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటుందంటూ ఒక మెసేజ్ పెట్టి అందరికని  తెగ సస్పెన్స్‌లో పెట్టేశాడు. 
Prabhas-Stylish-Look
దీనితో ప్రభాస్ బయటపెట్టబోయే ఆ విషయం పై అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ఆరోజు ప్రభాస్ తన మ్యారేజ్ విషయం ప్రకటిస్తాడా ? లేక ‘ ‘సాహో’ మూవీ మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తాడా ? లేదా రాధాకృష్ణతో తను చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తాడా? .అనే ప్రశ్నల చుట్టూ ప్రభాస్ ప్రకటన హడావిడి చేస్తోంది. 
Prabhas
రాబోతున్న పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ తన ‘సాహో’ సినిమాకు సంబంధించిన ఒక వీడియోను విడుదల చేసి సరిపెట్టే అవకాసం చాల స్పష్టంగా కనిపిస్తూ ఉన్నా కానీ వచ్చే ఏడాది సమ్మర్ లో రాబోయే ‘సాహో’ టీజర్ ను ఇప్పుడు ప్రభాస్ ఎందుకు విడుదల చేస్తాడు అని మరికొందరు వాదిస్తున్నారు. రాబోతున్న పుట్టినరోజుతో ప్రభాస్ 39 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. 

దీనితో ప్రభాస్ పుట్టినరోజునాడు అతడు షేర్ చేయబోయే విషయం అతడి పెళ్ళి గురించి మాత్రమే అయి ఉంటుందని పెళ్లి వచ్చే ఏడాది జరిగినా ఆ సస్పెన్స్ కు తెర తీసే రోజు మాత్రం ప్రభాస్ పుట్టినరోజు మాత్రమే అంటూ అభిమానులు కలలు కంటున్నారు. అయితే ఈవిషయాలకు సంబంధించి మరే ముఖ్య విషయం ప్రభాస్ బయటపెట్టబోయే న్యూస్ లో ఉండని నేపధ్యంలో ప్రభాస్ దసరా పండుగ రోజున అందరికీ పెద్ద పజిల్ పెట్టాడు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: