25 సంవత్సరాల సినిమా జీవితంలో 120 సినిమాల్లో కథానాయకుడుగా నటించి మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, ఏడు నంది అవార్డులు పొందినా రాని ప్రజాదరణ ఈ మధ్య విలన్ గా నటించటం మొదలెట్టాక మూడు నాలుగు సంవత్సరాల్లో టాలీవుడ్ లో స్టార్ట్ అయి దక్షిణ భారతంలోనే ప్రసిద్ధ ప్రతి నాయకుడుగా ఎదిగిపోయాడు. మరీ అరవింద సమేత వీరరాఘవలో ఆయన నటన బసిరెడ్ది పాత్రలో పరాకాష్టకు చేరింది. నిజంగా పసివాళ్లు ఆ పాత్రలో ఆయన నటనను చూసి చడ్డీలు తడుపుకున్నారట. అంతగా విలనీని ప్రతిష్టించారు. 

Image result for jagapati babu movie mudra

విలన్ గా సౌత్ లో మంచి గుర్తింపు పేరు ప్రతిష్ఠలు తెచ్చుకుంటున్న జగపతిబాబు కథానాయకుడిగా కూడా అప్పుడపుడు కనిపిస్తున్నారు. అయితే ఎక్కువగా విలన్ పాత్రల ద్వారానే జగపతికి ప్రేక్షకుల్లో క్రేజ్ వస్తోంది. అన్ దుకే సపోర్టింగ్ రోల్స్ లో నటించటం కూడా చాలా వరకు తగ్గించేశారు. మరోసారి చాలా రోజుల తరువాత కథానాయకుడి గా కనిపించేందుకు సిద్ధమయ్యారు.

Related image

బ్లాక్ మని పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో వెండి తెరకు ఏక్కుతున్న ముద్ర అనే సినిమాలో జగపతి బాబు నటిస్తున్నారు. బ్లాక్-మనీపై పోరాటం చేసే వ్యక్తిగా ఈ చిత్రంలో జగపతి బాబు కనిపించనున్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల్లో నెగ్గడం కోసం బ్లాక్-మనీని పోగుచేసి వాటిని ఖర్చుపెడుతూ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్న అంశాన్ని కీలకంగా చేసుకొని ఈ చిత్రాన్ని నిర్మించినట్లు చిత్ర సమర్పకుడు నట్టి కుమార్ తెలిపారు.

Related image

ఎన్.కె. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ముద్ర సినిమా ను క్యూటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. దాదాపు షూటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. వీలైనంత త్వరగా సినిమాకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకొ ని దీపావళికి పండుగకు సినిమాను విడుదల చేయటానికి సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.

jagapathi babu mudra release date

మరింత సమాచారం తెలుసుకోండి: