మెగా ఫ్యామిలీ హీరోల సంఖ్యతో పోటీ పడుతూ ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరోల సంఖ్య నెమ్మది నెమ్మదిగా పెరిగిపోతోంది. ఇప్పటికే మహేష్ బావ సుధీర్ బాబు వరసపెట్టి సినిమాలు చేస్తున్న నేపధ్యంలో ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీ ఆదిపత్యం మరింత కొనసాగించడానికి మహేష్ బాబు మేనల్లుడు రంగప్రవేశం నిన్న దసరా రోజున జరిగింది. 
లుక్ చూసి కంగారుపడొద్దు
ప్రముఖ వ్యాపార వేత్త రాజకీయ నాయకుడు గల్లా జయదేవ్ కుమారుడు మహేష్ మేనల్లుడు కి పరిచయం కాబోతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్‌ ను హీరోగా పరిచయం చేస్తున్న మూవీ నిన్న విజయదశమి రోజున ప్రారంభం అయింది. ‘అదే నువ్వు అదే నేను' టైటిల్‌ తో తీయబోతున్న ఈమూవీని దిల్ రాజ్ నిర్మిస్తున్నాడు. 
నభా నటేష్ హీరోయిన్
శశి అనే కొత్త దర్శకుడు తీయబోతున్న ఈసినిమా గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా నిన్నటి ఈమూవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రొటీన్ కు భిన్నంగా కనిపించిన హీరో గల్లా అశోక్ లుక్ చూసి చాలామంది ఆశ్చర్య పోయినట్లు టాక్. కొత్తగా ఇండస్ట్రీకి పరిచయమయ్యే హీరోలు ఫస్ట్ సినిమా ప్రారంభోత్సవంలో స్మార్ట్‌గా కనిపిస్తుంటారు. 
ప్రముఖ సమక్షంలో
కానీ గల్లా అశోక్ మాత్రం అందుకు భిన్నంగా బాగా పెరిగిన గెడ్డం మీసంతో కనిపించాడు. దీనితో ఈకార్యక్రమాన్ని కవర్ చేయడానికివచ్చిన మీడియా వర్గాలు కూడ షాక్ అయినట్లు సమాచారం. ఈమూవీ కథ ఒక లవ్ స్టోరీ అని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఇలాంటి లుక్ గల్లా అశోక్ కు ఎందుకు పెట్టారు అన్న కోణంలో కామెంట్స్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా కథ ప్రకారం ఇలా పెరిగిన గడ్డం మీసంతో ఈమూవీ ఫస్ట్ షెడ్యూల్ ల్ సీన్లు తీయాల్సి ఉన్న నేపధ్యంలో అశోక్ ఇలా ఈమూవీ ప్రారంభోత్సవానికి వచ్చాడు అని తెలియగానే మీడియా వర్గాలు ఊపిరి పీల్చుకున్నట్లు సమాచారం..  



మరింత సమాచారం తెలుసుకోండి: