తెలుగు ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ కి సంబంధించిన ముఖ్యపాత్రలకు సంబంధించిన స్టిల్స్ రిలీజ్ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే.  ఎన్టీఆర్ నట జీవితానికి సంబంధించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఆయన రాజకీయ జీవితానికి సంబంధించిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’సంక్రాంతి కానుకగా వస్తున్నాయి.   ఇప్పటికే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్..ఏఎన్ఆర్ గా సుమంత్, ఏపీ సీఎం చంద్రబాబు పాత్రలో రానా, అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో రకూల్ ప్రీత్ సింగ్, ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాయి. 
Image result for ఎన్టీఆర్ మహానాయకుడు
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన వెన్నంటి ఉన్న నందమూరి హరికృష్ణ కు పాత్ర ఆయన తనయుడు నందమూరి కళ్యాన్ నటిస్తున్నారు.  దీనికి సంబంధించిన ఓ ఫోటో రిలీజ్ చేసినా పూర్తిగా చూపించలేదు.  తాజాగా నందమూరి హరికృష్ణ పాత్రలో కళ్యాన్ రామ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  ఇందులో తండ్రీ కొడుకుల ముచ్చ‌ట్లు ప్రేక్ష‌కుల్లో సినిమాపై ఆస‌క్తి పుట్టిస్తున్నాయి. విన‌యంగా తండ్రి ముందు అలా త‌ల దించుకుని హ‌రికృష్ణ ముచ్చ‌టిస్తుంటే.. అన్న‌గారు ఆయ‌న‌కు ఏదో ఆదేశాన్నిస్తున్నారు. ఎన్టీఆర్ ఇందులో ముఖ్య‌మంత్రిగా ఉన్నట్లు కనిపిస్తుంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్, హ‌రికృష్ణ మ‌ధ్య ఉండే బంధాన్ని కూడా హైలైట్ చేయ‌నుంది. ముఖ్యంగా చైత‌న్య‌రథం సీన్స్ అన్ని సినిమాలో చాలా బాగా వ‌స్తున్నాయ‌ని తెలుస్తుంది.  దీనికి సంబంధించి షూటింగ్ కూడా ఈ మద్య ప్రారంభం అయినట్లు సమాచారం.  మొత్తానికి ఈ ఫ‌స్ట్ లుక్స్ చూస్తుంటేనే సినిమాపై భారా అంచనాలే పెరిగిపోతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: