సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే.  స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు.  ఆ తర్వాత వరుసగా విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ..స్టార్ హీరోగా ఎదిగాడు.  ఈ మద్య నాపేరు సూర్య సినిమాతో అభిమానుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ తదుపరి సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు.  ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లే..ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా తాను ప్రేమించిన అమ్మాయి స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నాడు.
 గ్రామస్తులతో పాటు సమీపంలోని గ్రామాలకు చెందిన వారు అల్లు అర్జున్ చూసేందుకు తరలివచ్చారు.  బన్నీతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. దసరా శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ బన్నీ థ్యాంక్స్ చెప్పారు. అత్తారింట్లో బన్నీ దసరా పండుగకు సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
సినిమా హీరోలు అంటే ఎంతో వైభోగంగా..లగ్జీరీ మెయింటేన్ చేస్తారు.  పండుగలు, పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుకల ఎంతో వైభవంగా జరుపుకుంటారు.  కానీ అల్లు అర్జున్ మాత్రం దసరా, దీపావళికి తన అత్తారింటికి వచ్చి సాదారణ వ్యక్తిగా అందరితో కలిసిపోతుంటారు.   దసరా పండుగ సందర్భంగా సిటీని వదిలి పెట్టి అత్తగారింటికి వెళ్లాడు హీరో అల్లు అర్జున్. తన భార్య స్నేహారెడ్డి అమ్మమ్మ స్వగ్రామమైన నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి గ్రామానికి వెళ్లాడు. కుటుంబ సమేతంగా వెళ్లి, సందడి చేశాడు.  గ్రామంలోని ఇరుగుపొరుగు వారిని బన్నీ పేరుపేరునా పలకరించారు. 
 దసరా పండుగను తన అత్తారింట్లో సెలబ్రేట్ చేసుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి అమ్మమ్మ స్వగ్రామమైన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి ఆయన కుటుంబ సమేతంగా వెళ్లి సందడి చేశారు. బన్నీ రాకతో ఆయన అత్తగారింటి వద్ద సందడి వాతావరణం నెలకొంది.
ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించి చిన్నారులకు స్వీట్లు పంచిపెట్టారు.  గ్రామస్తులతో పాటు సమీపంలోని గ్రామాలకు చెందిన వారు అల్లు అర్జున్ చూసేందుకు తరలివచ్చారు. సెల్పీలు, ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. తనకు దసరా శుభాకాంక్షలు చెప్పినవారందరికీ అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపాడు. అత్తారింట్లో బన్నీ దసరా పండుగకు సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: