తెలుగు ఇండస్ట్రీలో ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మొదట్లో పెద్దగా సక్సెస్ సాధించలేక  పోయాడు.  హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘చత్రపతి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు.  అప్పటి నుంచి ప్రభాస్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.  తర్వాత వచ్చిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి లాంటి చిత్రాలతో స్టార్ డమ్ పెంచుకున్నాడు. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘బాహుబలి, బాహుబలి 2’ చిత్రాలతో ఏకంగా జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు ప్రభాస్. 
Image result for prabhas
ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచనలం సృష్టించింది.  దాంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది..బాలీవుడ్ లో కూడా పలు మూవీ ఛాన్స్ లు వచ్చాయి.  బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ‘సాహూ’చిత్రంలో నటిస్తున్నాడు.  సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూపర్ హీరోయిన్ గా నటిస్తుంది.  భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఏ అప్ డేట్స్ కూడా బయటకు రావడం లేదు. 
Related image
తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్...ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కు విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు.  ప్రభాస్ ట్విట్ కి ఫ్యాన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. మీరు బర్త్ డే సందర్బంగా ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నమంటూ రిప్లై ఇచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: