రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడు. బాలకృష్ణ నటిస్తున్న సినిమా తో పాటు ఈ సినిమా కూడా సంక్రాంతి భరిలో రిలీజ్ చేయనున్నాడు. అయితే రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో ను వదిలి అందులో ఒక విషయం చెప్పాడు. ఈ సినిమా లో  కళ్లు బైర్లు కమ్మే నిజాలు చూపించబోతున్నాని ప్రకటించాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు తీస్తున్న ఇతరకు ఓపెన్ ఛాలెంజ్ చేశారు.

ఈ సినిమా ఆవిడ గురించి కాదు

ఎన్టీ రామారావుగారి నిజమైన అభిమానులకు నా బహిరంగ ప్రకటన. సినిమా అనేదానికి సరైన నిర్వచనం జీవితానికి అద్దం పట్టడం. జీవితానికి అర్థం నిజంగా జీవించడం. అసలు నిజానికి నిజంగా జీవించే వారికి మరణం ఉండదు. ఎందుకంటే అలాంటివారు భౌతికంగా మరణించినా వారు ప్రేమించే మనుషుల గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. ఎన్టీఆర్ గారి మీద ఈ సినిమా తీయడానికి ముఖ్యకారణం ఆయన జీవితంలో అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టాలు ఉండటమే.

జనవరి 24న విడుదల, ఆ ఉద్దేశ్యం లేదని చెప్పినా నమ్మరు

ఎన్టీ రామారావు జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఆయన జీవితంలో లక్ష్మి పార్వతి ప్రవేశించిన తర్వాత ఉద్భవించిన కొన్ని అత్యంత కీలకమైన విపత్కర పరిణామాలు. అందుకనే ఈ చిత్రానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ అని పేరు పెట్టడం జరిగింది. దీన్ని కేవలం ఒక సినిమా అనడం సినీ మహాతల్లిని, ఎన్టీఆర్ గారిని కూడా అవమానించినట్లే. ఎందుకంటే ఇది ఒక జీవిత సత్యాన్ని చెరపడానికి చచ్చేంత ప్రయత్నం చేసినా చెరపలేకుండా చేయడానికి కెమెరాతో వేయబోతున్న అతి కచ్చితమైన రౌద్ర ముద్ర. ఆ వీడియో లో చెప్పాడు దీనితో రామ్ గోపాల్ వర్మ ఇంతకు ఈ సినిమా లో ఏం చూపించ బోతున్నాడని అందరూ ఆసక్తిగా ఉన్నారు.  దీనితో చంద్ర బాబు కు కస్టాలు తప్పవని అందరూ అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: