తెలుగు ఇండస్ట్రీలోకి హ్యాపీడేస్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా విజయం అందుకోలేక పోయాయి.  స్వామిరారా చిత్రం నుంచి మనోడు వెనక్కి తిరిగి చూసుకోలేదు..ప్రతి చిత్రంలోనూ వైవిధ్యభరిత నటన ప్రదర్శిస్తూ..ప్రజల అభిమానం చూరగొన్నాడు.  తెలుగు ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటే హీరోలో నిఖిల్ ఒకరిగా చేరిపోయారు.  తాజాగా నిఖిల్ నటిస్తున్న చిత్రం ‘ముద్ర’. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్స్, టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.

ప్రస్తుతం 'ముద్ర' చిత్రం చేస్తున్న యంగ్ హీరో నిఖిల్ తాజాగా మరో చిత్రానికి కూడా ఓకే చెప్పాడు. కిషన్ కట్టా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. నివేదా థామస్ కథానాయికగా నటించే ఈ చిత్రానికి 'శ్వాస' అనే టైటిల్ని ఖరారు చేశారు.  తేజ్ ఉప్పలపాటి, హరిణికేశ్ రెడ్డి కలసి నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలను ఈ రోజు హైదరాబాదు అన్నపూర్ణా స్థూడియోలో నిర్వహించారు. 
Image result for nikhil swasha new movie
ఈ పోస్టర్ చూస్తుంటే మరోసారి కొత్త అంశంతో రాబోతున్నట్లు కనిపిస్తుంది.  చిత్రం టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను కూడా సోషల్ మీడియా ద్వారా నిర్మాతలు రిలీజ్ చేశారు. 'ముద్ర' పూర్తికాగానే ఈ 'శ్వాస' షూటింగులో నిఖిల్ పాల్గొంటాడు.  వరుస విజయాలు అందుకుంటున్న నిఖిల్ ఈ రెండు చిత్రాలతో మరోసారి విజయాన్ని అందుకుంటారా లేదా చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: