విశాల్ హీరోగా సూపర్ హిట్ సినిమా పందెం కోడి సీక్వల్ గా పందెం కోడి 2 అంటూ దసరా బరిలో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది పందెం కోడి-2. లింగుస్వామి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా గురువారం రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది.


ఇక ఈ సినిమా మిక్సెడ్ టాక్ తోనే దర్శక నిర్మాతలు నిరాశకు గురవుతుంటే పైరసీ దెబ్బ మరింత షాక్ ఇచ్చింది. విశాల్ తన సినిమాలకు పైరసీ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. తమిళనాడులో ఎక్కువగా పైరసీ జరిగే తంజావూరు, త్రిచూరు ప్రాంతంలో పందెం కోడి-2 రిలీజ్ సైతం ఆపేశాడు.
అయినా సరే పందెం కోడి-2 హెచ్.డి క్వాలిటీ ప్రింట్ పైరసీ అయ్యింది. దీనికి డౌన్ లోడ్ ఆప్షన్ కూడా ఉంది. ఇప్పటికే ఆ హెచ్.డి ప్రింట్ చాలా మంది డౌన్ లోడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. పైరసీ దెబ్బకు విశాల్ పందెం కోడి-2 కలక్షన్స్ కు గండి పడే అవకాశం ఉందని చెప్పొచ్చు. విశాల్ సినిమా మీద పైరసీదారులు కక్ష్య కట్టి మరి ఇలా చేస్తున్నట్టు తెలుస్తుంది.


విశాల్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించి మెప్పించారు. తెలుగులో మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా తమిళంలో మాత్రం సూపర్ హిట్ అంటున్నారు. విశాల్ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాతో లింగుస్వామి మళ్లీ ఫాంలోకి వచ్చేసినట్టే అని కోలీవుడ్ టాక్. 



మరింత సమాచారం తెలుసుకోండి: