‘మహర్షి’ సినిమా కోసం ప్రస్తుతం అమెరికాలో ఉన్న మహేష్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కు ఊహించని షాక్ ఇచ్చాడు అని వార్తలు వస్తున్నాయి.  మైత్రీమూవీస్ సుకుమార్ మహేష్ బాబుల కాంబినేషన్ లో ప్రారంభం కావలసి ఉన్న సినిమా కథ విషయంలో సుకుమార్ చెప్పిన కధను మహేష్ తిరస్కరించినట్లు టాక్.
 Mahesh Babu and Sukumar
తెలంగాణలో జారిన రజాకార్ల ఉద్యమకాలం నేపథ్యంలో ఉండే పీరియాడిక్ స్టొరీ లైన్ కు తాను ఏమాత్రం సూటు అవ్వను అని మహేష్ అభిప్రాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రతి హీరో ఏదో ఒక పీరియాడిక్ మూవీ చేస్తున్న నేపధ్యంలో మళ్ళీ అదే ట్రెండ్ గుడ్డిగా ఎందుకు అనుసరించాలి అని మహేష్ సుకుమార్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనికితోడు తెలంగాణా రజాకార్ల మూమెంట్ కధలకు ఆంధ్ర సీడెడ్ ప్రేక్షకులు కనెక్ట్ కారు అనే అభిప్రాయంలో కూడ మహేష్ ఉన్నట్లు సమాచారం. 
Mahesh Babu and Sukumar
పీరియాడిక్ సినిమా కాకుండా మరో సబ్జక్ట్ చూడమని మహేష్ సుకుమార్ కు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ తన దగ్గర ఉన్న వేరే కథలను మహేష్ కు వినిపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు మహేష్ అమెరికా నుండి హైదరాబాద్ తిరిగి వచ్చిన తరువాత వచ్చే నెలలో ఈమూవీ కధకు సంభందించిన క్లారిటీ వస్తుంది అని అంటున్నారు. 
Mahesh Babu and Sukumar to team up soon? Here’s what we know
ఒకసారి మహేష్ దగ్గర నుంచి గ్రీన్  సిగ్నల్ వచ్చేస్తే వీలయినంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పూర్తిచేసి వెంటనే షూటింగ్ ప్రారంభించాలి అన్నది సుకుమార్ ఆలోచన అని అంటున్నారు. గతంలో మహేష్ సుకుమార్ తో ‘1 నేను ఒక్కడినే’ సినిమా విషయంలో చేసిన పొరపాటు మరోసారి చేయకుండా మహేష్ ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అనిపిస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: