అందరూ ఊహిస్తున్నట్లుగానే ‘మీ టూ’ సెగ దక్షిణాది సినిమా రంగానికి కూడ తాకడమే కాకుండా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో కొందరు హీరోల చుట్టూ ఈవివాదం చుట్టుముడుతోంది. ఈ లిస్టులో ప్రప్రధమంగా టాలీవుడ్ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన అర్జున్ పేరు ఇప్పుడు బయటకు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 
నా అనుమతి లేకుండానే
సౌత్ ఇండియాలో యాక్షన్ హీరోగా పేరు గడించడంతో పాటు తెలుగు, తమిళం, కన్నడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ మీద తాజాగా ఆరోపణలు వచ్చాయి. కన్నడ నటి శృతి హరిహరన్ అర్జున్ షూటింగ్ సమయంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేసింది. ఇటీవల విడుదలైన 'కురుక్షేత్రం'లో శృతి హరిహరన్ అర్జున్‌కు జోడీగా నటించిన నటించిన సంగతి తెలిసిందే.
రిహార్సల్స్ సమయంలో వేధింపులు
‘కురుక్షేత్రం' సినిమా షూటింగ్ సమయంలో అర్జున్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని శృతి హరిహరన్ ఆరోపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన రొమాంటిక్ సీన్ రిహార్సల్ జరిగే సమయంలో అర్జున్ ప్రవర్తన వల్ల తాను ఇబ్బంది పడినట్లు ఆమె మీడియాకు లీకులు ఇస్తోంది. తాను చిన్నతనం నుండి అర్జున్ సినిమాలు చూస్తూ పెరిగానని అంతేకాకుండా అలాంటి హీరోతో నటించే అవకాశం వచ్చినప్పుడు తాను పడ్డ బాధను వివరిస్తూ ఈసినిమాకు సంబంధించి తమ ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు అర్జున్ ప్రవర్తన చాల మితిమీరి కనిపించడంతో తాను చాల మానసిక క్షోభ అనుభవించాను అని అంటోంది శృతి హరిహరన్. 
అలా కవర్ చేసే ప్రయత్నం చేశారు
అంతేకాదు తన వీపు మీద చేయి వేసి తనను అదోరకంగా టచ్ చేస్తూ తనను మానసిక బాధకు అర్జున్ గురి చేసిన విషయాన్ని వివరంగా వివరించింది శృతి హరిహరన్. అయితే ఇది అంతా రియాలిటీ కోసమే ఇలా చేసాను అని అర్జున్ తప్పించుకుంటున్నాడని ఆమె ఆరోపిస్తూ ఇలా హీరోయిన్స్ తో వ్యవహరించే ఎంతో మంది హీరోల లిస్టు తన దగ్గర ఉంది అంటూ ‘మీ టూ’ సెగకు మరింత వేడిని పెంచుతోంది శ్రుతి హరిహరన్..   



మరింత సమాచారం తెలుసుకోండి: