Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 1:03 am IST

Menu &Sections

Search

ప్రభాస్ పై ఒక ముద్దు గుమ్మ స్వీట్-రివెంజ్?

ప్రభాస్ పై ఒక ముద్దు గుమ్మ స్వీట్-రివెంజ్?
ప్రభాస్ పై ఒక ముద్దు గుమ్మ స్వీట్-రివెంజ్?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాంబే సినిమా పరిశ్రమ బాలీవుడ్‌ లో వివాదాల విజయాల ముద్దు గుమ్మ, ఎప్పుడూ ఏదో ఒక గొడవతో వార్తల్లో నిలిచే ఆ అందాలరాశి తాజాగా టాలీవుడ్ నుండి  అంతర్జాతీయ స్థాయి కెదిగిన స్టార్ హీరో పై చేసిన వ్యాఖ్యలు హాట్ - హాటర్ - హాటెస్ట్ టాపిక్‌ గా మారాయి.
 

"బాలీవుడ్‌ క్వీన్"  కంగన రనౌత్ రూటే సెపరేటు. ఎఫైర్స్ గురించి మాట్లాడినా, నెపోటిజంపై ప్రశ్నించినా,  'మీ..టూ'కి వంత పాడినా, కాస్టింగ్ కౌచ్ పై  కారాలు మిరియాలు నూరినా,  మగజాతి దురహంకారాన్ని ఎదిరించినా కంగన స్టైలే వేరు. అందుకే, బీటౌన్‌ లో కాంట్రవర్సీల కేంద్రం కంగన రనౌత్. కాంట్రవర్సీల కేరాఫ్ అడ్రస్ అంటూ కొంత మంది కామెంట్స్ కూడా చేస్తుంటారు.
bollywood-news-tollywood-news-young-rebal-star-pra
ఇక తాజాగా  మణికర్ణిక సినిమాతో, భారత ఫ్రథమ స్వాతంత్ర సమరాన్ని, ఒంటరిగా ఒంటి చేత్తో నడిపించిన,  వీరనారి ఝాన్సీ లక్ష్మీ‌బాయ్ పాత్రలో, అలరించడానికి సిద్ధమవు తోన్న ఈ నిజ జీవిత వీరనారి కంగన రనౌత్, తన తొలి నాళ్ళ హీరో ప్రభాస్‌ పై చేసిన కామెంట్స్ హాట్ - హాటర్ - హాటెస్ట్ టాపిక్‌ గా, గాసిప్స్ కు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారాయి.
bollywood-news-tollywood-news-young-rebal-star-pra 
హీరోయిన్‌ గా కెరీర్ మొదలు పెట్టిన తొలిరోజుల్లోనే కంగన ను 'ఏక్ నిరంజన్' సినిమా కోసం దర్శకుడు పూరీ జగన్నాథ్ కథానాయిక గా తీసుకున్నాడు. తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం లో ప్రభాస్ సరసన జోడీగా నటించింది ఈ అందాల గుమ్మ. అయితే ఆ తర్వాత కంగన సౌత్‌ ను వదిలేసి పూర్తిగా బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టి టాప్ రేంజుకు చేరుకోవడం, ఇక్కడ ప్రభాస్ కూడా 'బాహుబలి'గా మారి బాలీవుడ్‌ గుర్రాలకే పగ్గలు వేయటం వెంట వెంటనే జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా  కంగన దగ్గర ప్రభాస్ ప్రస్తావన తీసుకొస్తే తాను ప్రభాస్‌ తో 'ఏక్ నిరంజన్' నుంచే మాట్లాడటం మానేశాననే బాంబ్ పేల్చిందట.
bollywood-news-tollywood-news-young-rebal-star-pra 
'ఏక్ నిరంజన్' సమయంలో ప్రభాస్‌ కు తనకు మధ్య పెద్ద గొడవ జరిగిందని, దాంతో అప్పట్నుంచి ఇద్దరం మాట్లాడుకోవడమే మానేశామని బాలీవుడ్ మీడియా మిత్రులకు చెప్పిందట కంగన. అయితే 'బాహుబలి'లో ప్రభాస్ నటన చూసి చాలా గర్వంగా ఫీలయ్యానని, అలాగే 'మణికర్ణిక' లో తన నటన చూసి ప్రభాస్ కూడా గర్వంగా ఫీలవుతాడు అంటూ తన పాత్ర గొప్పదనం గురించి గట్టి గానే చెబుతోందట ఈ బాలీవుడ్ బ్యూటీ.
bollywood-news-tollywood-news-young-rebal-star-pra
ఇక ప్రభాస్‌కు తనకు ఏ విషయంలో గొడవ జరిగిందనే విషయాన్ని మాత్రం చెప్పకుండా దాటేసిందట. బహుశ వీళ్ళ మద్య కాష్టింగ్ కౌచ్ లాంటి చిల్లర గొడవలు ఉండక పోవచ్చు.  వృత్తి గత పోటీ మాత్రమే ఉండి ఉంటుందంటారు సినీ జనులు.
 bollywood-news-tollywood-news-young-rebal-star-pra
ఏదిఏమైనా హృతిక్‌ తో ఎఫైర్ కాంట్రవర్సీ, ఆ మధ్య క్రిష్‌ తో  మణికర్ణిక  డైరెక్షన్ ఇష్యూ, ఇప్పుడు బయటపెట్టిన ప్రభాస్‌ తో గొడవ, ఇలా కాంట్రవర్సీ లు లేని కంగన ను ఊహించలేం అంటూ సెటైర్స్ వేస్తున్నారు సినీవిశ్లేషకులు. మొత్తం మీద బాహుబలికి దీటుగా ఝాన్సీ లక్ష్మీ‌భాయ్ పాత్రతో ప్రభాస్ కు ఝలక్ ఇవ్వాలనుకుంటున్న  కంగన కోరిక,  ప్రభాస్ పై స్వీట్ రివెంజ్ ఏమైనా ఉంటే తీరాలని ఆశిద్ధాం.

bollywood-news-tollywood-news-young-rebal-star-pra

రిపబ్లిక్ డే కానుకగా రాబోతున్న మణికర్ణిక — ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ తో ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో?  ప్రబాస్ ను ఏలా గెలుస్తుందో? చూద్ధాం!  

bollywood-news-tollywood-news-young-rebal-star-pra

bollywood-news-tollywood-news-young-rebal-star-pra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పులిని వేటాడాలంటే వేచి చూచి వేటెయ్యాలి! నోటికి పని చెపితే అది నాకేస్తుంది
కేసీఆర్ జన ధిక్కారం - ఆర్టీసి బంద్ కాస్తా సకల జనుల సమ్మెగామారి విజయవంతం
రాజ్యాంగ వ్యవస్థల హితవులను సైతం పెడచెవిన పెడుతున్న కేసీఆర్!
‘సెల్ఫ్‌ డిస్మిస్‌’ గవర్నర్ ప్రశ్నకు సంకటంలో పడ్డ కేసీఆర్ ప్రభుత్వం!
రఘురాం రాజన్ కౌంటర్ కు నిర్మలా సీతారామన్ ఎన్-కౌంటర్
కియారా అద్వాణి దెబ్బకు అమాంతం పెరిగిన సెక్స్-టాయ్స్ సేల్స్!
సైరా నిజం బడ్జెట్ చెపితే చాలు - సినిమా బ్రేక్ ఈవెన్ ఏం ఖర్మ – లాభాలే వస్తాయి!
"బజాజ్-చేతక్" స్కూటర్లలో రారాజు మళ్ళి వస్తుంది: 'చేతక్' అంటే ఏమిటో తెలుసా!
సుప్రీం కోర్టులో న్యాయవాది దౌర్జన్యం...కలత చెందిన న్యాయమూర్తులు - సీజేఐ ఆగ్రహం
దేశ ఆర్ధిక శాఖ మంత్రి ఇంట్లో 'ఆర్ధిక మాంద్యం' ..... తంటా!
పాఠశాలల్లో లైంగిక విఙ్జాన పాఠ్యాంశం తప్పనిసరి కానుందా?
అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి–బోల్తాపడ్డ-కేసీఆర్ కి..షాక్!
పివి నరసింహారావు - మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్ధిక విధానాలు భారత్ ను బంగారుబాటలో నడిపించాయా?
భారత్‌ ప్రయాణం ఇక నల్లేరు మీద నడకకాదు! ‘అంతర్జాతీయ మందగమనం’ వైపే!
About the author