‘నోటా’ ఫెయిల్యూర్ తో విజయ్ దేవరకొండ స్పీడ్ కు చెక్ పడటంతో ఈక్రేజీ హీరో తన భవిష్యత్ సినిమాల కథల ఎంపిక విషయంలో చాలజాగ్రత్తగా అడుగులు వేస్తూ వీలైనంత వరకు ఫెయిల్యూర్స్ మళ్ళీ పలకరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈపరిస్తుతుల మధ్య ఈహీరో నటించిన ‘టాక్సీ వాలా’ రిలీజ్ డేట్ విజయ్ దేవరకొండకు నెగిటివ్ సెంటిమెంట్ ను సూచిస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి.
Vijay Deverakonda Taxiwala full movie available on Internet! Treat or Shock?
‘టాక్సీ వాలా’ మూవీని నవంబర్ 7న దీపావళి రోజున విడుదలచేయాలని భావించారు. అయితే అమావాస్య సెంటిమెంట్ ఏమాత్రం కలిసిరాదు అన్న భయంతో విజయ్ ఈసినిమా నిర్మాతల పై ఒత్తిడి చేసి ఈమూవీ విడుదల తేదీని నవంబర్ 16కు మార్పించినట్లు తెలుస్తోంది. ఈమూవీతో పోటీగా విడుదల అవుతున్న మరి ఏపెద్ద సినిమాలు లేకపోయినా విజయ్ దేవరకొండ మాత్రం  ‘ట్యాక్సీవాలా’ విషయంలో అంత సంతోషంగా ఏమీ లేడని సమాచారం. 

ఇప్పటికే అనేక వాయిదాలు పడి విడుదల కాబోతున్న ఈమూవీ మేకింగ్ విషయంలో విజయ్ దేవరకొండకు ఒక అసంతృప్తి ఉన్నట్లు టాక్. తాను ఎన్నో అంచనాలు పెట్టుకున్న ‘నోటా’ ఫెయిల్ అయిన తరువాత ఇప్పటికే ఫ్రీ నెగిటివ్ టాక్ ను తెచ్చుకున్న ‘టాక్సీ వాలా’ ఫలితం ఎలా ఉంటుంది అన్న విషయంలో విజయ్ కు చాల అనుమానాలు ఉన్నట్లు టాక్. ఇలాంటి పరిస్థుతులలో ఒక మంచి సినిమాతో తిరిగి ట్రాక్ ఎక్కాలని విజయ్ ప్రయత్నాలు చేస్తున్నా అప్పటి వరకు ‘టాక్సీ వాలా’ ను ఆపడం కష్టం అన్న అభిప్రాయంలో ఈమూవీ నిర్మాతలు ఉన్న నేపధ్యంలో ‘టాక్సీ వాలా’ విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. 
Vijay Deverakonda
అసలైతే ఇలా వాయిదాల మీద వాయిదాలు పడ్డ సినిమాల ఫలితాలు ఆడవన్న సెంటిమెంటుంది. దీనికితోడు ఈసినిమాపై గీతా ఆర్ట్స్ కాంపౌండ్లోనూ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ లేదు. అయితే ఎదో విధంగా విజయ్ దేవరకొండ క్రేజ్ ను అడ్డుపెట్టుకుని ఈమూవీ నుండి బయటపడాలని అల్లు కాంపౌండ్ ప్రయత్నాలు చేస్తోంది. దీనితో విజయ్ తన కెరీర్‌పై ఈ సినిమా తన కెరియర్ కు ఎలాంటి టర్నింగ్ తీసుకుంటుందో అనిటెన్షన్ పడుతున్నట్లు సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: