జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన రిక్వెస్ట్ కు రాం చరణ్ రెస్పాండ్ అయ్యాడు. తిత్లీ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల భారీ ఆస్థి నష్టం జరిగింది. అక్కడి ప్రజలు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. అయితే వారి కోసం జనసేన అధినేత అక్కడకు వెళ్లి వారికి సహాయం అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.


అంతేకాదు పవన్ కళ్యాణ్ హీరో రాం చరణ్ కు శ్రీకాకుళం తుఫాను బాధిత ప్రాంతంలో ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సూచించారు. పవన్ రిక్వెస్ట్ కు చరణ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సరే అని చెప్పాడు. బాబాయ్ చెప్పినట్టుగా తాను శ్రీకాకుళంలో ఒక గ్రామాన్ని దత్త తీసుకుంటానని చెప్పారు.


అయితే అది ఏ గ్రామం అన్నది తన టీం నిర్ణయిస్తుందని అన్నాడు. దీనికి సంబందించి ఫేస్ బుక్ లో ఓ లెటర్ రూపంలో తన రెస్పాన్స్ అందించాడు రాం చరణ్. శ్రీమంతుడు సినిమా తర్వాత ఊరి దత్తత మీద సెలబ్రిటీస్ ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. పవన్ సలహా మేరకు చరణ్ కూడా ఊరి దత్తకు నడుం కట్టాడు. నాకు స్పూర్తిని ఇచ్చినందుకు థ్యాంక్స్ బాబాయ్ అన్నాడు చరణ్. 


మరి చరణ్ ఏ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నాడు. దాన్ని ఎలా డెవలప్ చేస్తాడు అన్న విషయాల మీద క్లారిటీ రావాల్సి ఉంది. కచ్చితంగా చరణ్ చేసే ఈ మంచిని అందరు ప్రశంసించాల్సిందే. ఇక సినిమాల విషయానికొస్తే రాం చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: