బాలకృష్ణ జూనియర్ లను ఒకేసారి ఒకే వేదిక పై చూడాలన్న నందమూరి అభిమానుల కోరికను ‘అరవింద సమేత’ సక్సస్ మీట్ కొంత వరకు తీర్చినా నిన్నటి ఫంక్షన్ లో బాలకృష్ణ ప్రవర్తన జూనియర్ అభిమానులలో తీవ్రనిరాశను కలిగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. వేదిక పై బాలయ్యా జూనియర్ లు చిరు నవ్వులు చిందించుకుంటూ పక్కపక్కనే నుంచుని ఆత్మీయంగా మాట్లాడుకున్నా బాలయ్య స్పీచ్ లో మాత్రం జూనియర్ ప్రస్తావన లేకపోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. 
balakrishna to attend aravinda sametha success meet
‘అరవింద సమేత’ మూవీని తాను ఇప్పటి వరకు చూడలేదు అంటూ బాలకృష్ణ ఈసినిమాలో నటించిన చాలామంది నటీనటుల గురించి ముఖ్యంగా సంగీత దర్శకుడు తమన్ దర్శకుడు త్రివిక్రమ్ ల గురించి చాల ఎక్కువగా మాట్లాడాడు. ముఖ్యంగా హీరోయిన్ పూజా హెగ్డే గ్లామర్ గురించి హిందీలో ఒక కవిత చదివి పూజా హెగ్డేను ఆశ్చర్య పరిచాడు. 
Not A Word About Tarak: Balakrishna Disappoints Fans
ఇలా చాల సేపు కొనసాగిన బాలకృష్ణ స్పీచ్ లో ఒకే ఒక్కసారి జూనియర్ ప్రస్తావన ఉంది. చాలామంది హీరోలు నటించే సినిమాలులా కాకుండా తాను అదేవిధంగా జూనియర్ నటించే సినిమాల క్యాన్వాస్ చాల పెద్దదిగా ఉంటుందని అందువల్లనే నందమూరి హీరోలు నటించే పాత్రలను టచ్ చేయడానికి ఇండస్ట్రీలోని హీరోలు అంతా భయపడతారు అంటూ తన నందమూరి ఫ్యామిలీ ఇగో బయటపెట్టాడు. 
aravinda sametha movie success meet
అయితే ‘అరవింద సమేత’ కోసం జూనియర్ పడ్డ కష్టం గురించి కానీ ఈసినిమా సాధించిన రికార్డుల గురించి కానీ అదేవిధంగా నటన పరంగా జూనియర్ గొప్పతనం గురించి కానీ ఒక్క మాట మాట్లాడకుండా జూనియర్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చి నిరాశను కలిగించాడు. అయితే హరికృష్ణ గొప్పతనం గురించి ఆయన మంచి మనసు గురించి బాలయ్య ఉద్వేగంతో చెప్పి హరికృష్ణ పై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. జూనియర్ గురించి అతి తక్కువగా బాలయ్య మాట్లాడటంతో మరొకసారి అతడి ‘ఇగో’ ‘అరవింద’ ఫంక్షన్ లో బయటపడింది అంటూ   కామెంట్స్ రావడమే కాకుండా జూనియర్ బాలయ్యల మధ్య గ్యాప్ అలాగే కొనసాగుతోందా అంటూ కొందరి సందేహాలను బయటపెడుతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: