వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏప్రకటన చేసినా ఆప్రకటన కొంతకాలం మీడియాను షేక్ చేస్తూనే ఉంటుంది. తాను తీయబోతున్న  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ గురించి ప్రస్తుతం వర్మ మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్వ్యూలు అదే విధంగా ఆ ఇంటర్వ్యూలలో వర్మ చేస్తున్న కామెంట్స్ అత్యంత సంచలనంగా మారుతున్నాయి. 
Ram Gopal Varma
ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన అసలు విషయాలను తాను చూపిస్తానంటూ చెబుతూ వస్తున్న రామ్ గోపాల్ వర్మ ఈసినిమాకు సంబంధించిన పనులను కూడ చాలా స్పీడ్ గా పూర్తి చేస్తున్నాడు.    ఇప్పుడు ఈసినిమాకుసంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న వర్మ ఈచిత్రం కోసం నటీనటులను ఎంపిక చేసేపనిలో క్షణం తీరిక లేకుండా ఉంటున్నాడు.   
Ram Gopal Varma
అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించబోతున్న ఈసినిమాకు సంగీత దర్శకుడిగా కీరవాణి సోదరుడు కళ్యాణి మాలిక్ ను ఎంపిక చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం కీరవాణి ఎన్టీఆర్ బయోపిక్ కు సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థుతులలో ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా వర్మ తీస్తున్న మూవీలో కీరవాణి తమ్ముడు ఎందుకు ప్రవేశించాడు అన్న విషయమై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
Ram Gopal Varma
దీనికితోడు రాజమౌళి అదేవిధంగా కీరవాణి కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీ అభిమానులు అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఇలాంటి పరిస్థుతులలో కళ్యాణ్ మాలిక్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు మ్యూజిక్ అందించడానికి ఎలా ఒప్పుకున్నాడు అంటూ కొందరు ఆశ్చర్య పోతున్నారు. ఇప్పటికే వర్మ ఈమూవీలో ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతుల ప్రేమ సన్నివేశాలను ఎక్కువగా చూపెడతాను అని లీకులు ఇస్తున్న నేపధ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లవ్ స్టోరీగా మారుతుందా అంటూ మరొకొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: