Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 17, 2019 | Last Updated 2:11 pm IST

Menu &Sections

Search

'అరవింద సమేత' సక్సెస్ మీట్ లో జగపతిబాబు ఉద్వేగం!

'అరవింద సమేత' సక్సెస్ మీట్ లో జగపతిబాబు ఉద్వేగం!
'అరవింద సమేత' సక్సెస్ మీట్ లో జగపతిబాబు ఉద్వేగం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఒకప్పటి హీరోలు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారుతున్నారు.  ఈ నేపథ్యంలో ఒకప్పటి రొమాంటిక్ ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతిబాబు ఇప్పుడు విలన్ గా మెప్పిస్తున్నాడు.  బోయపాటి శ్రీనివాస్ - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘లెజెండ్’ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు.  అప్పటి నుంచి ఆయనకు వరుసగా తెలుగు, తమిళ, మళియాళ ఈ మద్య బాలీవుడ్ లో కూడా ఛాన్సులు రావడం మొదలయ్యాయి.   ఆ మద్య ఓ కార్యక్రమంలో తాను హీరోగా ఉన్న సమయంలో ఎవరూ గుర్తించలేదని..రెమ్యూనరేషన్ కూడా సరిగా ఉండేది కాదని..విలన్ అవతారం ఎత్తిన తర్వాత అన్ని రకాలుగా ఛాన్సు లు రావడం..డబ్బు కూడా బాగానే వస్తుందని ఛలోక్తి విసిరారు. 
aravinda-sametha-movie-success-meet-trivikram-srin
ఏది ఏమైనా ప్రస్తుతం జగపతిబాబు కెరీర్ బాగానే సాగుతుంది.  తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత’సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని మొదటి వారం వంద కోట్లు కలెక్షన్లు సాధించింది.  కాగా, ఈ సినిమాలో జగపతి బాబు మెయిన్ విలన్ గా నటించి అందరిచేత షభాష్ అనిపించుకున్నాడు.  రాయలసీమ పౌరుషం, పగలూ, ప్రతికారాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించారు.  నిన్న 'అరవింద సమేత' సినిమా సక్సెస్ మీట్ జరిగింది.


ఈ సందర్భంగా జగపతి బాబు మాట్లాడుతూ.. సినిమా గురించి చెప్పడానికి ఏమీ లేదని... ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఎప్పుడో చెప్పానని ఆయన అన్నారు. రెండు విషయాలను తాను చెప్పాలనుకుంటున్నానని...  2010లో హీరోగా తన కెరీర్ అయిపోయిందని, 2012లో మా బాలయ్యబాబుతో  'లెజెండ్' సినిమాతో విలన్ గా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైందని చెప్పారు.  ఈ ఇద్దరు వారి సినిమాల్లో తన క్యారెక్టర్ కి ఎంతో ప్రాధాన్యత వచ్చేలా చేశారని అందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. 

తనకు తెలియకుండా బాలయ్య ఒక మంచి పని చేశారని... అది బయటకు చెప్పలేనని జగపతిబాబు చెప్పారు. తారక్, త్రివిక్రమ్ లతో గదిలో కూర్చున్నప్పుడు కూడా ఒక మంచి విషయం జరిగిందని... దాన్ని కూడా బయటకు చెప్పుకోలేనని అన్నారు. నందమూరి ఫ్యామిలీ చాలా గొప్పదని, వారి అభిమానులు గొప్పవారని, అందరూ మంచిగా కలసి ఉండాలని తెలిపారు. అసలైన దసరా, దీపావళి ఇక్కడ కనిపిస్తోందని చెప్పారు. జగపతిబాబు మాటలతో అభిమానులు కేరింతలు కొట్టారు.  


aravinda-sametha-movie-success-meet-trivikram-srin
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ
కియారా రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట!
ఇంత దారణమైన ప్రచారాలా? హైదరాబాద్ సీపీని కలిసిన వైఎస్ షర్మిళ
రాంచరణ్ ‘వినయ విధేయ రామ’ఫస్ట్ డే కలెక్షన్స్!
అనుష్క మూవీపై మాధవన్ క్లారిటీ!
ఆకట్టుకుంటున్న నాని ‘జర్సీ’టీజర్ రిలీజ్!