తెలుగు ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ అంటే ఓ సంచలనం అని తెలిసిందే.  తెలుగు, హిందీ భాషల్లో ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించిన రాంగోపాల్ వర్మ గత కొంత కాలంగా హిట్ చిత్రాలు అందుకోలేక పోతున్నారు.  అయితే ప్రతి చిత్రంలోనూ ఎదో ఒక వైవిధ్యం ఉండేలా చూసే రాంగోపాల్ వర్మ ఈ మద్య బయోపిక్ చిత్రాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు.  తాజాగా ఆయన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం రూపొందించబోతున్నారు.   అయితే ఈ చిత్రం తీయాలనే ఆలోచన చాలా విచిత్రంగా జరిగిందని..ఎంతో మంది అందగత్తెలతో నటించిన ఎన్టీఆర్ కు, ఈవిడ ఎక్కడ దొరికిందా? అన్న నెగటివ్ ఇంప్రెషన్ తో మొదలైన తన ఆలోచన, చివరకు ఆమెపై పాజిటివ్ దృక్పథాన్ని వచ్చేలా చేసిందని, ఆయన జీవితంలోని కొన్ని నిజాలను చూపించడమే లక్ష్యంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ను రూపొందిస్తున్నానని వర్మ వ్యాఖ్యానించారు. 
Image result for ntr laxmi parwathi
ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..రామారావు గొప్ప నటుడు మాత్రమే కాదు.. అద్భుతమైన మేధస్సు కలిగిన వ్యక్తి.. రాజకీయ వ్యవస్థనే మార్చేసిన వ్యక్తని అంటారు. విధానపరమైన నిర్ణయాల్లోనూ ఆయనకు ఆయనే సాటి. అలాంటిది లక్ష్మీ పార్వతి ప్రస్తావన వచ్చినప్పుడల్లా 'ఈ ఒక్క విషయంలో మాత్రం...' అంటుంటారు..ఆ ఒక్క విషయం ఎంటో దానిపైనే సినిమా వచ్చేలా ఫోకస్ పెట్టా. ఈ సినిమా కోసం, ఎన్టీఆర్ తో కలసి పనిచేసిన అధికారులు, ఆయనతో పరిచయం ఉన్న వారితో మాట్లాడానని చెప్పారు.  అంతే కాదు...చిన్న పనివారి అభిప్రాయాలు కూడా సేకరించానని అన్నారు.
Image result for ntr laxmi parwathi
ఎన్టీఆర్ చనిపోవడానికి వారం రోజుల ముందు ఇచ్చిన ఇంటర్వ్యూను చూశానని, ఆ వీడియోలో లక్ష్మీ పార్వతి గురించి ఆయన గౌరవం, అభిమానాలతో మాట్లాడారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించినప్పటి నుంచి ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరిగాయని..అవన్నీ వాస్తవ రూపంలో కళ్లకు కట్టినట్లు చూపించడానికి ప్రయత్నించానని..అయితే ఈ సినిమా రాజకీయ కోణంలో చూడవొద్దని అన్నారు.  తన దృష్టిలో రామారావు జీవితంలో ఓ డైనమిక్ ఫేజ్ లక్ష్మీ పార్వతేనని, ఆనందం, దుఃఖం, మోసం, కోపం అన్నీ ఉన్నాయని, తన చిత్రం బయోపిక్ కాదని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: