వరుస విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ దసరాకు వచ్చిన అరవింద సమేత సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎన్.టి.ఆర్ స్టామినా తెలిసేలా బాక్సాఫీస్ వసూళ్లను రాబడుతుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే.


ట్రిపుల్ ఆర్ అంటూ ఆ ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ నుండే అంచనాలు పెంచగా మెగా నందమూరి మల్టీస్టారర్ గా ఈ ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఉన్నారు. డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ మరో కొత్త లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది. 


ఎన్.టి.ఆర్ కోసం జక్కన్న హాలీవుడ్ ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ను తీసుకొచ్చారట. ఆల్రెడీ ఎన్.టి.ఆర్ తో సిక్స్ ప్యాక్ చేయించిన స్టీవెన్స్ ఇప్పుడు మరోసారి ఎన్.టి.ఆర్ ను మరో మేకోవర్ కు సిద్ధం అవుతున్నాడు. రాజమౌళి సూచించినట్టుగా ఈ వర్క్ షాప్ జరుగుతుందట. అనుకున్నట్టుగానే ముందు ఎన్.టి.ఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తుంది.


రాం చరణ్ మాత్రం ప్రస్తుతం చేస్తున్న బోయపాటి శ్రీను సినిమా షూటింగ్ పూర్తి చేశాక ట్రిపుల్ ఆర్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. మరి ఎన్.టి.ఆర్ కోసం రాజమౌళి చేసిన ఈ ఏర్పాట్లు తారక్ ను ఎలా కనిపించేలా చేస్తాయో చూడాలి. 2020 సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో ఈ సినిమా వస్తుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: