‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయడమే లక్ష్యంగా పరుగులు తీస్తున్న ‘సైరా’ మూవీకి సంబంధించి మరికొన్ని ఫోటోలు లీక్ అవ్వడంతో మెగా అభిమానులు ఆ ఫోటోలకు లైక్స్ కొడుతూ విపరీతంగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన భారీ షెడ్యూల్ జార్జియాలో జరుగుతున్న నేపధ్యంలో ఆ షూటింగ్ స్పాట్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. 
మరచిపోలేని క్షణాలు
చిరంజీవి మరింత పెరిగిన గుబురు గడ్డంతో కనిపిస్తున్న ఈ ఫోటోలను చూసి మెగా అభిమానులు సంబర పడుతూ చిరంజీవి లుక్ తమకు భయం కలిగిస్తోంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 
కళ్ళు చెదిరే యాక్షన్ సీన్స్
మెగాస్టార్ చిరంజీవితో సెల్ఫీ దిగిన చరణ్ దీప్ అనే వ్యక్తి ఈఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ  తన జీవితంలో ఈ క్షణాలని మరచిపోలేననిఅంటూ కామెంట్స్ పెట్టాడు.  
గుబురు గడ్డం
ప్రస్తుతం ఈమూవీకి సంబంధించి హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ పర్యవేక్షణలో సైరా యాక్షన్ సీన్స్ జార్జియాలో తీస్తున్న విషయం తెలిసిందే. బ్రిటీష్ వారితో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాడే సన్నివేశాలు అబ్బురపరిచే విధంగా ఉండబోతున్నాయి అన్న లీకులు వస్తున్నాయి.
వచ్చే ఏడాది సమ్మర్ ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈమూవీకి 500 కోట్ల బిజినెస్ చేయాలని చరణ్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోందితెలుస్తున్న సమాచారం మేరకు జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకుని ఈనెలాఖరుకు హైదరబాదు వచ్చే విదంగా ఈ మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం..   



మరింత సమాచారం తెలుసుకోండి: