ఈ రోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా ‘సాహో’  చిత్రం టీజర్ లేదా పోస్టర్ ను విడుదల చేస్తారంటూ చాలా రోజులుగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నవిషయం తెలిసిందే. అయితే ‘సాహో’ చిత్రంలోని  ప్రభాస్ పాత్రకు సంబంధించిన విభిన్న షేడ్స్ లో మొదటి షేడ్ ను ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1’ అంటూ ఈరోజు  ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా  ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నట్లుఅధికారికంగా ప్రకటించారు.
Prabhas,Saaho,Shraddha Kapoor
ఈ ప్రకటనకు సంబంధించిన పోస్టర్ లో ప్రభాస్ లుక్ పూర్తిగా కనిపించకుండా ముఖాన్ని నీడలో దాచేశారు. అయినప్పటికీ ఇది ‘సాహో’ కు సంబంధించిన పోస్టర్ కావడంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లిస్టులో ఇది చేరిపోవడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. 

Latest Updates: Prabhas New Movie 'Sahoo'

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో ఒక సినిమాకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ కు ట్విటర్ లో కేవలం 135 నిముషాలలో 1 మిలియన్ మెన్క్షన్స్ రావడం సోషల్ మీడియాకు సంబంధించి ట్విటర్ సామాజిక మాధ్యంలో రికార్డ్ అని అంటున్నారు. వాస్తవానికి నేడు ప్రభాస్ పుట్టినరోజునాడు ప్రభాస్ పెళ్ళికి సంబంధించి ఒక ప్రకటన ఉంటుంది అని కలలు కన్నారు ప్రభాస్ అభిమానులు. 

Saaho First Look Is Prabhas' Birthday Treat For Fans
అయితే తన పెళ్లి విషయంలో మరొకసారి ప్రభాస్ మాట తప్పినా ఆ విషయాన్ని పట్టించుకోకుండా అభిమానులు ‘సాహో’ ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1’ కు విడుదల కాకుండానే ఇస్తున్న రికార్డులు పరిశీలించిన వారు ఈమూవీ కలక్షన్స్ విషయంగా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అంచనాలకు కూడ అందడం లేదు అని కామెంట్స్ చేస్తున్నారు. నేటితో ప్రభాస్ 40వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపధ్యంలో తన సినిమాల కలక్షన్స్ విషయంలోనే కాకుండా తన పెళ్ళికి సంబంధించిన వయసుకు సంబంధించి కూడ ఎవరు అందుకోలేని రికార్డులు అందుకున్నా ఆశ్చర్య పడనక్కరలేదు..  


మరింత సమాచారం తెలుసుకోండి: