మహేష్ బాబు వంశీ పైడి పల్లిల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 18 నుంచి న్యూయార్క్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈమూవీ షూటింగ్ కు సంబంధించి కొన్ని ఫోటోలు ఇప్పుడు లీక్ కావడంతో ఆ ఫోటోలలోని మహేష్ ‘ఆల్ట్రా స్టైలిష్ లుక్‌’ మతి పోగొడుతోంది అని అభిమానులు కామెంట్ చేస్తూ ఉంటే మరికొందరు మాత్రం మహేష్ కొత్త లుక్ సూపర్ స్టార్ ను 10 సంవత్సరాల వయసు పెద్దవాడిగా చూపెడుతోంది అంటూ కామెంట్స్ వస్తూ ఉండటంతో అప్పుడే ‘మహర్షి’ పై నెగిటివ్ ప్రచారం మొదలైపోయింది.
మహర్షి
మహేష్ బాబు కెరియర్ కు సంబంధించి ఇది 25వ సినిమా కావడంతో ఈమూవీలోని మహేష్ లుక్ గురించి చాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఎప్పుడు లేని విధంగా ఈమూవీ కోసం మహేష్ బాబు తన గడ్డంను కూడ పెంచుకున్నాడు. అయితే ఇప్పుడు అమెరికాలో తీస్తున్న సీన్స్ లో మహేష్ క్లీన్ షేవింగ్ లుక్ తో కనిపిస్తున్న నేపధ్యంలో ఈమూవీలో మహేష్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తాడు అన్న అంచనాలు నిజం అయ్యాయి. 
వంశీ పైడిపల్లి మాస్టర్ మైండ్
మహేష్ బాబుతో సినిమా చేయడానికి వంశీ పైడిపల్లి దాదాపు రెండు సంవత్సరాలు వెయిట్ చేయడమే కాకుండా అతడి మైండ్ కు పదును పెట్టి మంచి కథ రాయడమే కాకుండా మహేష్ లుక్ కు సంబంధించి అనేకమంది స్టైలిస్ట్ లతో చర్చలు జరిపి మహేష్ కు ఒక డిఫరెంట్ లుక్ ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ లుక్ కు సంబంధించి అప్పుడే విమర్శలు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

ఇది ఇలా ఉండగా ఈమూవీ షూటింగ్ స్పాట్ నుండి లీక్ అవుతున్న మహేష్ లుక్ కు సంబంధించిన ఫోటోలను చూసి యూనిట్ వర్గాలు కలవర పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీ యూనిట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫోటోలు లీక్ అవుతున్న నేపధ్యంలో ఈ లీకులకు ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియక దర్శకుడు వంశీ పైడి పల్లి తలపట్టు కుంటున్నట్లు టాక్..  



మరింత సమాచారం తెలుసుకోండి: