‘అరవింద సమేత’ సూపర్ సక్సస్ ను ఎంజాయ్ చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఊహించని విధంగా లేటెస్ట్ గా ‘అజ్ఞాతవాసి’ యూట్యూబ్ లో క్రియేట్ చేస్తున్న రికార్డులను చూసి ఆశ్చర్య పడటమే కాకుండా త్రివిక్రమ్ మైండ్ బ్లాంక్ అయినట్లు సమాచారం. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అజ్ఞాతవాసి’ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ భయంకరమైన ఫ్లాప్ ల రికార్డులలో మొదటి వరసలో నిలబడింది.
Agnathavasi' Inspires Everyone To Watch 'Largo winch'
ఈసినిమాను రెండవసారి చూడటానికి పవన్ వీరాభిమానులు కూడ భయపడ్డారు అంటే ఈమూవీ క్రియేట్ చేసిన భయంకరమైన ఫ్లాప్ రికార్డులు ఎవరికైనా గుర్తుకు వస్తాయి. అయితే అనూహ్యంగా ఈమూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ కు యూట్యూబ్ లో వస్తున్న రికార్డులు సంచలనంగా మారాయి. ‘ఎవడు 3’ పేరుతో హిందీలో డబ్ కాబడ్డ ‘అజ్ఞాతవాసి’ మూవీ యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన 48 గంటలలో 18 మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం సంచలనంగా మారడమే కాకుండా త్రివిక్రమ్ కు కూడ అర్ధంకాని విషయంగా మారింది.
Agnyaathavaasi first look
త్రివిక్రమ్ కు లేనిపోని అపఖ్యాతి తెచ్చిపెట్టిన ‘అజ్ఞాతవాసి’ షాక్ నుండి తేరుకోవడానికి ఎన్ని నెలలు స్వయంగా త్రివిక్రమ్ మీడియాకు కనిపించకుండా ఎన్ని నెలలు అజ్ఞాతవాసం చేసాడో అందరికీ తెలిసిన విషయమే. మరింత ఆశ్చర్యకరంగా ‘అజ్ఞాతవాసి’ హిందీ డబ్బింగ్ వెర్షన్ కోలీవుడ్ టాప్ హీరో అజిత్ ‘వివేగం’ హిందీ డబ్బింగ్ వెర్షన్ కు వచ్చిన హిట్స్ కంటే ఎక్కువ రావడం షాకింగ్ న్యూస్ గా మారింది. 

అంతేకాదు ‘అజ్ఞాతవాసి’ హిందీ డబ్బింగ్ వెర్షన్ కు యూట్యూబ్ లో దక్షిణాది టాప్ హీరోలు నటించిన సినిమాల డబ్బింగ్ వెర్షన్స్ కంటే యూట్యూబ్ లో ఎక్కువ హిట్స్ రావడం పవన్ అభిమానులకు జోష్ ను ఇచ్చే న్యూస్ గా మారింది. ‘అజ్ఞాతవాసి’ దెబ్బతో సినిమాలను వదిలి రాజకీయాల బాట పట్టిన పవన్ కళ్యాణ్ కు ఈన్యూస్ తెలిస్తే రాబోతున్న ఎన్నికల లోపు మరో సినిమా చేసే ప్రయత్నాలు చేస్తాడేమో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: