సొంత వారు శిఖరాయమానంగా ఉంటే వారసులు వెలవెల పోవడం చూస్తూనే వున్నాం. అటువంటిది తండ్రి ఓ నిర్మాత. పెదనాన్న స్టార్ అయినా అప్పటికి అది కూడా  మసకబారిపోయింది. ఆ టైంలో సినిమాల్లోకి వాళ్ళ  కేరాఫ్ అంటూ ప్రవేశించిన ఓ కుర్రాడు ఎవరూ ఊహించని టాప్ స్టార్ డం ని సొంతం చేసుకోవడం అంటే ఆషా మాషీ విషయం కాదు. అటువంటి ఫీట్ ని సాధించిన గ్రేట్ హీరో ప్రభాస్. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. నలభై సంవత్సరాలు నేటితో పూర్తి చేసుకున్న ప్రభాస్ మరిన్ని విజయాల కొసం రేపటి వైపుగా సాగుతున్నాడు.


ప్రభాస్ వెండి  తెరపై అరంగేట్రం చేస్తూ తీసిన ఈశ్వర్ మూవీ ఏమంత గొప్పగా లేదు. అల్లరి చిల్లరి కుర్రాడి కధ అది ఆ సినిమా తరువాత క్రిష్ణం రాజు  గారి తమ్ముడు కొడుకుట అన్నారంతా. ఆ తరువాత చేసిన సినిమాలు కూడా ఏవీ పెద్దగా ఆడలేదు. అపుడు వారసులకు కాలం కలసిరాని వేళ పెదనాన్న హీరో  అని చెప్పి వచ్చిన ఈ కుర్రాడు ఎలా నిలదొక్కుకుంటారని అంతా పెదవి విరిచారు.  సరిగ్గా  అదే టైంలో అంటే 2004 సంక్రాంతి వేళ వచ్చింది వర్షం మూవీ, తీసింది కొత్త డైరెక్టర్ శోభన్. హీరోయిన్ త్రిష. ఆ టైంలోనే సంక్రాంతి హీరో బాలయ్య లక్ష్మీ నరసిమ్హ కూడా పోటీగా రిలీజ్ అయింది. చిత్రమేమిటంటే పెద్దగా అంచనాలు లేని వర్షం రికార్డుల దుమ్ము దులిపేసింది. ఆ ఒక్క సినిమాతో ప్రభాస్ కి తిరుగులేని స్టార్ డం వచ్చేసింది.


ఆ తరువాత  కూడా కొన్ని పరాజయాలు పలకరించినా రాజమౌలి చత్రపతి ప్రభాస్ ని టాప్ రేంజిలో నిలబెట్టింది యంగ్ రెబెల్ స్టార్ బిరుదును ఇచ్చేలా చేసింది. ఆ మూవీ తరువాత ప్రభాస్ మరో ఘాట్ సినిమా మిర్చీ సూపర్ డూపర్ హిట్.  మధ్యలో ఫ్యామిలీ సినిమాలుగా  వఛ్ఛిన‌ డార్లింగ్, మిష్టర్ పెర్ఫెక్ట్ వంటివి విశేషంగా అలరించాయి. ప్రభాస్ లో అన్ని రకాల షేడ్లూ ఉన్నాయనిపించాయి. సరిగ్గా ఈ టైంలో మరో మలుపు తిరిగింది ప్రభాస్ కెరీర్


బాహుబలి మూవీకి ప్రభాస్ సైన్ చేయడం గొప్ప విషయమే. ఎందుచేతనంటే రెండు భాగాలుగా వచ్చినా ఆ మూవీ కోసం విలువైన అయిదేళ్ళ కాలాన్ని ప్రభాస్ వెచ్చించాడు. అయినా ఆ  రెండు మూవీలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచి ప్రభాస్ కి ఒక్కసారిగా ఇంటెర్నేషనల్ స్టార్ ఇమేజ్ ని తీసుకువచ్చాయి. ఆ సినిమాలు ఒప్పుకోవడం ద్వారా తన జడ్జిమెంట్  కరెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. పడిన కష్టానికి, ఇచ్చిన కాలానికి సరిపడా పేరు ప్రఖ్యాతులు ప్రభాస్ సొంతం అయ్యాయి.


ఇపుడు ప్రభాస్ ఇంటర్నేషల్ స్టార్. అతని కాన్వాస్ చాల పెద్దది. ఎవరూ అందుకోలేనిది. బాహుబలి ఇమేజ్ ని నిలబెట్టుకునేలా ఆయన తరువాత సినిమాలు ఉండాలి. అందుకోసమే సాహో అంటున్నాడీ హీరో. అది కూడా రికార్డులు క్రియేట్ చేయాలని, ప్రభాస్ వర్సటైల్ ఆర్టిస్ట్ గా ఉండాలని మనసారా కోరుకుంటూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.


మరింత సమాచారం తెలుసుకోండి: