‘అరవింద సమేత’ సక్సస్ మీట్ లో జూనియర్ బాలకృష్ణలను ఒకే వేదిక పై చూసిన తరువాత నందమూరి అభిమానులు జూనియర్ ను ఒక ప్రత్యేకమైన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ లో చూపెడితే బాగుంటుంది అన్న తమ అభిప్రాయాలను నందమూరి ఫ్యాన్స్ తమ వాట్సాప్ గ్రూపుల్లో ఒకరికొకరు షేర్ చేసుకుంటూ హడావిడి చేస్తున్న విషయాలు తెలిసినవే. ఈవిషయాలు దర్శకుడు క్రిష్ వరకు చేరడంతో క్రిష్ ఈవిషయాలకు సంబంధించి ఒక రాజీ మార్గాన్ని బాలకృష్ణకు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. 
S.-S.-Rajamouli-Formula-for-NTR-Biopic
ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఇప్పుడు ఈ బయోపిక్ లో జూనియర్ అభిమానుల కోరిక మేరకు తారక్ కు ఒక ప్రత్యేకమైన పాత్రను క్రియేట్ చేయడం కష్టం అయినప్పటికీ దీనికి సంబంధించి ఒక రాజీ మార్గాన్ని క్రిష్ బాలయ్యతో చర్చించినట్లు సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్ లో స్క్రీన్ ప్లే రీత్యా ఏర్పడ్డ కొన్ని గ్యాప్ లను ఫిల్ చేయడానికి జూనియర్ వాయిస్ ఓవర్ తో డైలాగ్స్ చెప్పిస్తే అది ఎన్టీఆర్ బయోపిక్ కు మరింత క్రేజ్ ఏర్పడటంలో సహకరించడమే కాకుండా ఈమూవీ భారీ ఓపెనింగ్స్ కు జూనియర్ గొంతు సహకరిస్తుంది అన్న ఆలోచన క్రిష్ బాలయ్యతో పంచుకున్నట్లు టాక్. 
Nandamuri Balakrishna will portray his father NTR, while Kalyan Ram will play his father Harikrishna.
ప్రస్తుతానికి ఈ విషయమై బాలయ్య నుండి ఎటువంటి స్పందనా లేకపోయినా ఈమూవీ నిర్మాతలలో ఒకరైన కొర్రపాటి సాయి మాత్రం ఈవిషయమై బాలయ్యను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. అయితే ఈ రాజీ మార్గాలకు ఎంత వరకు జూనియర్ వైపు నుండి సహకారం లభిస్తుంది అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి.
NTR biopic will star Nandamuri Balakrishna as his father and will release in two-parts.
ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి రెండురోజులకు ఒక లేటెస్ట్ స్టిల్ ను విడుదల చేస్తూ అంచనాలు పెంచుతున్న వ్యూహాలలో ఈమూవీకి జరగబోయే భారీ బిజినెస్ వల్ల బాలకృష్ణకు ఈసినిమా విడుదల కాకుండానే 25 కోట్లు లాభం రావచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. ఈసినిమాలో బాలకృష్ణ వివిధ రకాల గెటప్స్ లో కనిపిస్తున్నప్పటికీ ఈ హడావిడి అంతా కేవలం సినిమా మొత్తంలో ఒక అరగంట మాత్రమే ఉంటుందని మిగతా రెండు గంటలు ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎమోషన్లు బంధాలు అనుబంధాలు హైలెట్ చేస్తూ ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి సంబంధించిన ఎవరికీ తెలియని అనేక విషయాలు ఈసినిమాలో ఉండబోతున్నాయి అని వార్తలు వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: