టాలీవుడ్ లోకి ‘ఈశ్వర్’ సినిమాతో హీరోగా పరిచయం అయిన ప్రభాస్ కెరీర్ కొత్తలో పెద్దగా హిట్ సినిమాలతో ఏమీ సాగలేదు.  మొదటి నుంచి మాస్ ఇమేజ్ కోసం తాపత్రపడుతున్న ప్రభాస్ కి రాజమౌళి దర్శకత్వంలో ‘చత్రపతి’తో సూపర్ హిట్ లభించింది.  అప్పటి నుంచి వరుస విజయాలతో దూసుకు పోతున్న ప్రభాస్ కి మరోసారి రాజమౌళి తిరుగులేని విజయాలు అందించారు.  రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి, బాహుబలి2 దాదాపు ఐదు సంవత్సరాలు కష్టపడి తీశారు.  అందుకు తగ్గ ఫలితం కూడా వీరిద్దరూ పొందారు. 
ప్రభాస్ బర్త్ డే: ‘సాహో’ టీమ్ గిఫ్ట్
ఇక ప్రబాస్ కి అయితే జాతీయ స్థాయి నటుడిగా మంచి గుర్తింపు లభించింది.  బాహుబలి2 సినిమా తర్వాత ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకొని ‘సాహూ’సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమాకు సంబంధించి ఆ మద్య చిన్న టీజర్ వచ్చింది..తర్వాత పోస్టర్ అంతే మళ్లీ ఎలాంటి అప్ డేట్స్ రాలేదు.  ప్రభాస్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి 16 సంవత్సరాలు.. చేసినవి 18 సినిమాలు. అందులో విజయాలు ఉన్నాయ్. అంతకు మించి అపజయాలు ఉన్నాయి.  ప్రభాస్ విషయంలో దర్శక, నిర్మాతలు ఎంతో హ్యాపీగా ఉంటారు..ఎలాంటి కాంట్ర వర్సీలకు పోకుండా తన పని తాను చేసుకు పోయే మంచి మనస్థత్వం కలిగిన నటుడు అని అందరూ అంటారు.  అందరితో కలుపుగోలుగా ఉండే ప్రభాస్ కి స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా ఎలాంటి గర్వానికి పోకుండా ఉంటారని టాక్. 

నటుడిగా ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం సంపాదించాలంటే నవరసాలను పండించగలగాలి. జానర్ ఏదనేది కాదు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందా లేదా అన్నదే ప్రభాస్ కాన్సెప్ట్. అందుకే సక్సెఫుల్ హీరో అయ్యాడు. ఈశ్వర్ తో ప్రస్థానం మొదలు పెట్టిన ప్రభాస్ ‘బాహుబలి’లాంటి గొప్ప సినిమాల్లో నటించి మెప్పించాడు.  ఈ రోజు ప్రభాస్  తన 39వ పుట్టినరోజును జరుపుకోనున్నాడు. ఈ సందర్బంగా సాహో టీమ్ అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ను ప్లాన్ చేసింది.  సుజిత్ దర్శకత్వంలో వస్తున్న సాహూ సినిమాకు సంబంధించిన పోస్టర్ తో పాటు కొద్ది సేపటి క్రితం వీడియో మేకింగ్ టీజర్ రిలీజ్ చేశారు.   
Related image
ప్రభాస్ బర్త్ డే రోజు ఫ్యాన్స్ కు ఎలాగైనా డబుల్ బొనాంజా ఇవ్వాలని చిత్ర యూనిట్ ఆలోచించింది..ఆ మేరకు పోస్టర్, టీజర్ రిలజ్ చేయడం..అందులో హాలీవుడ్ స్థాయిలో వీడియో మేకింగ్ కనిపిస్తుంది.  చివర్లో ప్రభాస్ ఎంట్రీ చాలా స్టైలిష్ గా చూపించారు.  బైక్ ఛేజింగ్ చూస్తుంటే..ఈ సినిమా మరో బాహుబలి రేంజ్ లో సాగుతుందని అభిమానులు తెగ సంతోషంలో మునిగిపోతున్నారు.  ఈ టీజర్ కి సోషల్ మీడియాలో తెగ రెస్పాన్స్ వస్తుంది. 


 


మరింత సమాచారం తెలుసుకోండి: