టాలీవుడ్ లో స్టార్ పొజీషన్లో ఉన్న డైరెక్టర్ త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత’ రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం 'అరవింద సమేత' బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపిన సంగతి తెలిసిందే.  విజయవంతంగా సెకండ్ వీకెండ్ పూర్తి చేసుకుని తాజాగా రూ. 150 కోట్లు(గ్రాస్) మార్కును క్రాస్ చేసింది. దసరాకి ముందు విడుదలైన ఈ సినిమా తొలిరోజే రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. మొదటి రోజే దాదాపు రూ. 39 కోట్ల షేర్ రాబట్టిన వీరరాఘవుడు, మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరాడు.

ఫస్ట్ వీకెండ్ లోపే రూ. 100 కోట్లు

అయితే ఆ తర్వాత అదే ఊపును కొనసాగించడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఇటీవల మాస్‌ ఫార్ములాను పక్కన పెట్టి వరుస విజయాలు సాధిస్తున్న తారక్‌, ఫైనల్‌గా తాను అనుకున్నట్టుగా త్రివిక్రమ్‌తో ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా చేశాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాథాకృష్ణ (చినబాబు) నిర్మించారు. అందరి అంచనాలు అందుకున్న ‘అరవింద సమేత’ మంచి విజయం అందుకొని కలెక్షన్లు కొల్లగొడుతుంది.   ఎన్టీఆర్ కెరీర్లో రూ. 150 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించిన తొలి చిత్రం ఇదే.

మొత్తం పెట్టుబడి తిరిగొచ్చినట్లేనా?

2018లో విడుదలైన తెలుగు చిత్రాల్లో భారీ వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా రికార్డుల కెక్కింది. ఆల్ టైమ్ తెలుగు ఇండస్ట్రీ కలెక్షన్ రికార్డులను పరిశీలిస్తే.... ప్రస్తుతం 6వ స్థానంలో ఉంది.   12 రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ సాధించింది ‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీ. దేశవ్యాప్తంగా వచ్చిన గ్రాస్ వసూళ్లు రూ.105.6 కోట్లు ఉండడం మరో విశేషం. తెలుగురాష్ట్రాల్లోనే నూరు కోట్ల షేర్‌కి దగ్గర్లో ఉన్నాడు తారక్. ఇంతకు ముందు ‘బాహుబలి 2’, ‘బాహుబలి’, ‘రంగస్థలం’, ‘ఖైదీ నెం. 150’ సినిమాలు మాత్రమే తెలుగురాష్ట్రాల్లో వందకోట్ల కలెక్షన్లు రాబట్టగలిగాయి.

లాభాల్లోకి వెళ్లినట్లేనా?

ఇప్పుడు ఆ లిస్టులో ‘అరవింద సమేత వీరరాఘవ’ చేరింది.  ఇంకో 6 కోట్లు వసూళ్లు చేయగలిగితే బయ్యర్లు సేఫ్ అయినట్టే! ఇందులో యూఎస్‌లో ఈ సినిమాను భారీ రేట్‌కి అమ్మడంతో ఆ మొత్తం వసూలు చేయడం కష్టంగానే కనిపిస్తోంది. ఎంత లేదన్నా అక్కడ హాఫ్ మిలియన్ నష్టాలు వచ్చేలా కనిపిస్తోంది. ఆ మొత్తం కాకుండా మిగిలిన 3 కోట్లు మాత్రమే. దాంతో సినిమా యావరేజ్ జోన్ దాటి, హిట్టు దిశగా సాగుతోంది.


ఏరియావైజ్ షేర్ వివరాలు ఏరియా వైజ్ షేర్ వివరాలు :

నైజాంలో   : రూ. 20.25 కోట్లు

సీడెడ్     : రూ. 15.82 కోట్లు

వైజాగ్‌  : రూ. 8.02 కోట్లు

ఈస్ట్‌  : రూ. 5.28 కోట్లు

వెస్ట్ :  రూ. 4.56 కోట్లు

కృష్ణ : రూ. 4.73 కోట్లు 

గుంటూరు : 7.68 కోట్లు

నెల్లూరు : రూ. 2.40 కోట్లు,

కర్నాటక : రూ. 9.01 కోట్లు,

రెస్టాఫ్ ఇండియా : రూ. 2.60 కోట్లు 

ఓవర్సీస్  : రూ. 13.12 కోట్లు 

టోటల్ రూ. 91.05 కోట్లు 

మరింత సమాచారం తెలుసుకోండి: