తెలుగు లో చిన్న పాత్రల్లో నటించిన ఈషా రెబ్బా హీరోయిన్ గా కూడా మంచి ఛాన్సులు వచ్చాయి.  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత’ సూపర్ హిట్ అయ్యింది.  అన్ని సెంటర్లో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం రూ.150 కోట్ల క్లబ్ లో చేరింది.   ఈ చిత్రంలో నటించి ఎన్టీఆర్, పూజా హెగ్డె, జగపతి బాబు కి ఎంతో పేరు వచ్చింది.  అయితే సహాయ నటిగా నటించిన ఈషా రెబ్బాకి  మాత్రం పెద్దగా పేరు రాలేదు..అసలు ఎక్కడా ప్రసక్తి కూడా తీసుకు రావడం లేదు. 
Image result for aravinda sametha movie eesha rebba
'అరవింద' సినిమాయే ఆమె కెరియర్లో పెద్ద సినిమా అని చెప్పొచ్చు. ఈ చిత్రంతో ఈషా రెబ్బాకి మంచి పేరు వస్తుందనీ, ఆమె బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. అంతే కాదు ఈ చిత్రంలో  ఈషా రెబ్బా పాత్రకి సంబంధించిన సన్నివేశాలను ఎక్కువగా కట్ చేయడం వలన, ఆమె ప్రభావం ప్రేక్షకులపై అంతగా లేకుండా పోయింది.
Image result for aravinda sametha movie eesha rebba
ఈ చిత్రం మంచి సక్సెస్ అయితే ఎన్నో అవకాశాలు వస్తాయనుకున్న తన ఆనందానికి గండి కొట్టినట్లయ్యిందని వాపోతుంది.  'అరవింద'కి ముందు ఈషాకి రెండు చిత్రాలు వచ్చాయట. 'అరవింద'ను చూసుకుని ఆమె వాటిని వదిలేసిందట. ఇప్పుడు ఆ రెండు చిత్రాలు పోయినందుకు .. 'అరవింద' చేసినందు వలన పెద్దగా ప్రయోజనం లేనందుకు ఈషా నిరాశకి లోనైందని చెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: