ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను కొందరు మీడియా సంస్థ ప్రతినిధులతో జరుపుకుంటూ ఈరాత్రి కొందరికి విలాసవంతమైన బర్త్ డే పార్టీ తనకు సన్నిహితంగా ఉండే మీడియా సంస్థల ప్రతినిధులకు ఒక స్టార్ హోటల్ లో ఇవ్వబోతున్నట్లు సమాచారం. సామాన్యంగా పార్టీలకు పబ్ లకు దూరంగా ఉండే ప్రభాస్ ఈసారి పిలిచి మరీ మీడియా వర్గాలకు పార్టీ ఇవ్వబోతు ఉండటం వెనుక ఆంతర్యం ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి.
Shades Of Saaho
ఇప్పటికే ఈపార్టీకి సంబంధించి ప్రభాస్ పిఆర్ టీమ్ నుండి కొన్ని మీడియా సంస్థలకు పిలుపు వెళ్ళినట్లు సమాచారం. మీడియా వర్గాలతో చిట్ చాట్ అంటే ప్రభాస్ సినిమాల దగ్గర నుండి ప్రభాస్ పెళ్ళి వరకు అనేక ఆసక్తికర విషయాల పై ప్రశ్నలు ఉండే నేపధ్యంలో ఈరోజు ప్రభాస్ ఇవ్వబోతున్న బర్త్ డే పార్టీలో తన పెళ్ళికి సంబంధించి ఏమైనా లీకులు ఉంటాయ అన్న ఆసక్తి మీడియా వర్గాలలో ఉంది. 
Prabhas in Saaho
ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అనేకమంది ప్రముఖ జర్నలిస్టులకు ఫోటోగ్రాఫర్లకు పిఆర్ మేనేజర్లకు ఇప్పటికే ఈ బర్త్ డే పార్టీ ఆహ్వానాలు అందినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా ఈరోజు విడుదలైన ‘సాహో’ కు సంబంధించిన షేడ్స్ ఆఫ్ ‘సాహో’ చాప్టర్ 1 ను చూస్తుంటే ప్రభాస్ స్టైలిష్ లుక్ కనిపిస్తోంది అంటూ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. భారీ యాక్షన్ ఎపిసోడ్ కు సంబంధించిన మేకింగ్ ను చాప్టర్ 1 లో చూపించడంతో పాటు ప్రభాస్ స్టైలిష్ లుక్ ను రివీల్ చేయడంతో ఈరోజు ఎక్కడ చూసినా మీడియా వర్గాలలో ‘సాహో’ వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 
Amy Jackson to make a cameo appearance in Prabhas' Saaho?
ఒక హాలీవుడ్ మూవీ రేంజ్ లో యాక్షన్ సీన్ ను తెరకెక్కిస్తున్న మేకింగ్ వీడియో పై అంచనాలు ఎలా ఉంటాయో అలాంటి అంచనాలు ప్రభాస్ ‘సాహో’ ఏర్పడుతున్నాయి. దీనితో ఈసినిమాకు సంబంధించి రాబోతున్న చాప్టర్ 2 లో ఏం చూపిస్తారా అంటూ అప్పుడే చర్చలు మొదలైపోయాయి. దీనికితోడు ‘సాహో’ ప్రమోషన్ ను రాజమౌళి ‘బాహుబలి’ కి అనుసరించిన పద్ధతులలో ఒక్కో పాత్రకు సంబంధించిన పోస్టర్ మరియు మేకింగ్ వీడియోలను విడుదల చేయడం జరుగుతుంది అని అంటున్నారు. ఏమైనా ‘సాహ’ మేకింగ్ మీడియో ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ స్థాయిలో ఉంది అని కామెంట్స్ వస్తూ ఉండటంతో దర్శకుడు సుజిత్ తన మొదటి పరీక్షలో అత్యధిక మార్కులతో గట్టేక్కాడు అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: