ఈ మద్య కొంత మంది నటులు డ్రగ్స్ కేసులో పట్టుపడటం చూస్తూనే ఉన్నాం.  ఆ మద్య హైదరాబాద్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ రాకెట్ గుట్టు బయటపడింది..ఇందులో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వార్ల పేర్లు బయట పడ్డాయి.  అంతే కాదు సిట్ ముందు హాజరు కూడా అయ్యారు.  తాజాగా పలు సూపర్ హిట్ తెలుగు చిత్రాల్లో విలన్ పాత్రలను పోషించి మెప్పించిన బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్, తాజాగా నిషేధిత ఉత్ప్రేరకాలను దగ్గరుంచుకున్న కేసులో అరెస్ట్ అయ్యాడు. 

Image result for Ajaz Khan

దూకుడు, నాయక్‌, బాద్‌షా లాంటి చిత్రాల్లో నటించారు బాలీవుడ్ నటుడు అజాజ్‌ ఖాన్‌.  బిగ్‌బాస్‌ టీవీ షోతో పాపులర్‌ అయిన ఈ యువ నటుడు ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో కనిపిస్తుంటాడు.  ప్రస్తుతం నార్కోటిక్స్ అధికారుల అదుపులో ఉన్నట్లు సమాచారం.  

Image result for Ajaz Khan

అజాజ్ ఖాన్ వద్ద 2.3 గ్రాముల డ్రగ్స్,  రూ. 2.20 లక్షల నగదు, సెల్ ఫోన్స్ ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకుని, అరెస్ట్ చేశామని అధికారులు వెల్లడించారు. అజాజ్‌ను ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: