సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయ..కొన్ని సార్లు ఇక్కడ జరిగి చిత్ర విచిత్రాలు ఎవ్వరి ఊహకు అందవు.  ఎన్నో అంచనాల  పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టని ‘అజ్ఞాతవాసి’ మూవీ ఆన్ లైన్‌లో మాత్రం రికార్డుల మోత మోగిస్తోంది.  ఒకదశలో పవన్ కెరీర్‌లోని అత్యంత చెత్త సినిమాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. వసూళ్ల పరంగాను భారీ నష్టాలనే మిగిల్చింది.

హిందీలో రికార్డులు బద్దలు కొడుతున్న అజ్ఞాతవాసి

దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో మూడో ప్లేస్‌లో నిలిచింది. దీనికంటే ముందు ‘బాంబే వెల్వెట్’ మొదటి స్థానంలో ఉండగా...మహేశ్...‘స్పైడర్’ ఆల్ టైమ్ ఇండియన్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో రెండో ప్లేస్‌లో నిలిచింది.  త్రివిక్రమ్ ఇంత వరకు సంపాదించుకున్న బ్రాండ్ నేమ్ ఈ ఒక్క సినిమాతో చెల్లాచెదురైపోయింది. అయితే బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన ఈ సినిమా యూట్యూబ్‌లో మాత్రం దూసుకుపోతోంది.   ఈ మధ్యకాలంలో తెలుగులో పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా అన్ని సినిమాలను హిందీలో డబ్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు.

agnyaathavaasi hindi dubbed version creates record in youtube

తాజాగా పవన్ కళ్యాన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ మూవీని హిందీలో ‘ఎవడు 3’ పేరుతో డబ్ చేసి రిలీజ్  చేశారు.  ఈ చిత్ర హక్కులను గోల్డ్‌మైన్ టెలీఫింస్ సంస్థే కొనుగోలు చేసింది. గతంలో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాను ‘ఎవడు 2’ పేరుతో ఇదే సంస్థ హిందీలో విడుదల చేసింది.  రెండు రోజుల క్రితం ఈ మూవీని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేశారో లేదో ఈ మూవీ 24 గంటల్లో 17 మిలియన్ రికార్డ్  వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు ఈ మూవీ 23 మిలియన్ వ్యూస్‌ దక్కించుకుంది.

Image result for అజ్ఞాతవాసి

అంతేకాదు ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది సినిమాగా ‘అజ్ఞాతవాసి’ రికార్డు క్రియేట్ చేసింది.  ఆ విధంగా పవన్ 'అజ్ఞాతవాసి' ఓ అరుదైన రికార్డును సృష్టించింది. అంతేకాదు హిందీలో పవన్‌ కళ్యాణ్‌కు ఫాలోయింగ్ ఎలా ఉందో ఈ వ్యూస్ తెలియజేస్తున్నాయి.   ఇక ఈ డబ్బింగ్ వర్షన్ మరెన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: