ఇప్పుడు భారత దేశంలో ‘మీ టూ ’ పెద్ద ఎత్తున కొనసాగుతున్న విషయం తెలిసిందే.  మొదట సినీరంగంలో మొదలైన ఈ ప్రకంపణలు అన్ని రంగాలకు వ్యాపిస్తున్నాయి.  మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి బహిరంగాంగా ఆరోపణలు చేస్తూ...లైంగిక దాడులకు పాల్పడిన వారికి శిక్ష పడేలా చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో భారత విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ పదవి ఊడిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో అయితే నటులు నానాపటేకర్, దర్శకుడు సుభాష్ ఘయ్ తమ కీలక ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ నటించిన ఖుషీ సినిమా ఫేమ్ ముంతాజ్ తనకు సినీ పరిశ్రమలో ఎదురైన లైంగిక వేధింపులను చెప్పుకొచ్చింది. 

#Me too : Mumtaj answered with sandal to director

ఖుషి తరువాత కనుమరుగై, మళ్ళీ అత్తారింటికి దారేది సినిమాలో ఒక పాటలో అలరించిన ఈ బొద్దుగుమ్మ తమిళ్ బిగ్ బాస్ షో తో అక్కడ పాపులర్ అయ్యింది.  ముంతాజ్ ఇటీవలి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విషయాన్ని ప్రస్తావించింది. లైంగిక వేదింపుల బాధితుల జాబితాలో నేను కూడా ఉన్నాను. పలు సార్లు నేను లైంగికంగా వేదించబడ్డాను. అయితే వాటిని నేను ఓపిక ఉన్నంత వరకు భరించేదాన్ని అంతకు మించి నన్ను విసిగిస్తే లైంగికంగా వేదిస్తే మాత్రం సీరియస్ గా స్పందించేదాన్నని చెప్పారు.  ఓ దర్శకుడు సినిమా షూటింగ్ సందర్భంగా నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే చెప్పు తీసుకుని కొట్టాను.


ఈ వ్యవహారంపై నడిగర్ సంఘానికి వెంటనే ఫిర్యాదు కూడా చేశాను. దీంతో వాళ్లు జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరించారు.  ఆ తరువాత అది మనసులో పెట్టుకుని మళ్ళీ నాతొ అలాగే ప్రవర్తిస్తే .. ఈ సారి గట్టిగా వార్నింగ్ ఇచ్చానని ఆ తరువాత అతగాడు తన జోలికి రాలేదని పేర్కొంది. నేను మీటూ లో భాగస్వామి కాదల్చుకోలేదు అని, ఇవి కేవలం నా అనుభవాలు అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా మీటూ అంటూ సెలెబ్రెటీల మీద నిందలు వేసేవాళ్ళు కాస్త ఆలోచించు కోవాలని, నింద వేసి పబ్బం గడుపుకుంటే సరిపోదు, తగిన ఆధారాలు ఉంటేనే ఆరోపణలు చెయ్యాలని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: