ఆమె లక్కూ లుక్కూ రెండూ గొప్పవే, గ్లామర్ ఉంది. అభినయం కూడా పర్వాలేదు. కానీ ఇంతకంటే గొప్ప వారు ఎంతో మంది ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. మరి ఈ ముద్దు గుమ్మ మాత్రం ఆలా కాదు, సిని మాలు హిట్ ఫట్ లతో సంబంధం లేకుండా మూవీస్ చేస్తూ సత్తా చాటుతోంది. ఈ మధ్యనే ఈ అమ్మడు కోటి రూపాయలు కేవలం ఒక పాటకే తీసుకుందని టాక్. మరి ఈ అందం మరింతగా రెచ్చ గొట్టే పోజులు ఇవ్వడం దేనికోసమో.

  

లేటెస్ట్ గా రకుల్ ప్రీతి సింగ్ ఇన్స్టాగ్రాంలో పెట్టిన ఫొటోలు కుర్ర కారుకు ఫీవర్ గా మరాయి. ఆ పిక్స్ చూసిన లుక్స్ కి వేరే ఏదీ కనిపించడంలేదట. సకల లోకమంతా రకుల్ కనిపిస్తూ సోకులతో కెవ్వు కేక పెట్టించేస్తోందట. రకుల్ ఈ మధ్యనే ఆకు చాటు పిందెలా మారి బాలయ్య పక్కన రైన్ సాంగ్ వేసుకుంది. ఆ మూవీలో ఆలా నటించేందుకు ఒక్క పాట కోసం కోటి రూపాయల పారితోషికం తీసుకుందని ప్రచారం సాగింది.

 

మరిన్ని సినిమాల్లో చాన్స్ కొట్టేసుకుందుకు రెడీ అవుతున్నా ఈ అందాల అరవిందం ఇపుడు తన సొగసు సోయగాలను ఇలా ఇన్స్టాగ్రాంలో పరచేసింది. ఇంకా తాను బ్యూటీతో ఎన్నో వూసులు చెబుతానంటోంది. మరి ఆమెను తరువాత సినిమాకు బూక్ చేసుకుంటే కనులారా చూసి తరించేందుకు అభిమాన గణం దండీగా ఉన్నారు. ఇంతకీ ఎక్కడా తగ్గనంటున్న రకుల్ అందం సీక్రెట్ మాత్రం చెప్పనంటోంది. అందం చూడవయా ఆనందించవయా. మిగతావి నీకు అవసరం లేదయా అంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: