నిన్న ప్రభాస్ పుట్టినరోజున విడుదలైన ‘షేడ్స్ ఆఫ్ సాహో’ టీజర్ పై విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. ‘సాహో’ మూవీ మేకింగ్ హాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఉందని ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా అందరూ పొగడ్తల వర్షంతో ముంచెత్తి వేస్తున్నారు. అయితే ఈటీజర్ లో చివర కనిపించిన ప్రభాస్ నోటివెంట ఒక్క డైలాగ్ ఉంటే మరింత బాగుండేదని ప్రభాస్ అభిమానుల అభిప్రాయం.
సాహో
ఇలాంటి పరిస్థుతులలో నిన్న విడుదలైన ‘షేడ్స్ ఆఫ్ సాహో’ 1 లో ఎక్కడా ఈమూవీ రిలీజ్ డేట్ గురించి ప్రస్తావించక పోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ముఖ్యంగా టాప్ హీరోల సినిమాలకు సంబంధించిన టీజర్లను విడుదల చేసినప్పుడు ఆమూవీ సుమారుగా ఎప్పుడు విడుదల అవుతుంది అన్న సంకేతాలు ఇస్తారు. 
వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల అవుతుంది అని ప్రచారంలో ఉన్న ఈమూవీ విడుదల సమయం గురించి ఎటువంటి ప్రస్తావనా లేకుండా నిన్నటి ‘షేడ్స్ ఆఫ్ సాహో’ విడుదల కావడంతో ఈమూవీ వచ్చే సమ్మర్ కు విడుదల అవ్వడం కష్టమేనా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
60 రోజుల ప్రిపరేషన్
దీనికితోడు వచ్చే ఏడాది సమ్మర్ రేస్ కు రాబోతున్న చిరంజీవి ‘సైరా’ విడుదల తరువాత మాత్రమే ‘సాహో’ విడుదల ఉండేలా ‘సైరా’ నిర్మాత చరణ్ ‘సాహో’ నిర్మాతల మధ్య ఒక అంతర్గత ఒప్పందం జరిగింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ‘సాహో’ విడుదల తేదీ ‘సైరా’ విడుదలతో లింక్ కావడంతో కావాలనే  ‘సాహో’ నిర్మాతలు రిలీజ్ డేట్ ను ‘షేడ్స్ ఆఫ్ సాహో’ టీజర్ లో ప్రకటించలేదు అని అంటున్నారు.
హాలీవుడ్‌కు ఏ మాత్రం తీసిపోకుండా... డూప్ లేకుండా ప్రభాస్
నిన్న విడుదలైన టీజర్ విషయంలో కొన్ని విమర్శలు కూడ అప్పుడే ప్రారంభం అయ్యాయి. నిన్నటి ‘సాహో’ టీజర్ లో ఒక హాలీవుడ్ యాక్షన్ సినిమాలా ప్రతి సీన్ విషయంలోనూ భారీ తనం కనిపించింది కానీ ప్రభాస్ పాత్రకు సంబంధించి ఈ టీజర్ లో ఎటువంటి లీకులు ఇవ్వకపోవడంతో ‘సాహో’ టీజర్ ను చూస్తున్న వారికి ఒక హాలీవుడ్ యాక్షన్ మూవీ తెలుగు డబ్బింగ్ లా మాత్రమే అనిపించింది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనితో దర్శకుడు సుజిత్ రాబోతున్న ‘షేడ్స్ ఆర్ సాహో’ భవిష్యత్ టీజర్లలో ఈ మూవీ కథకు సంబంధించి కొద్దిగా లీకులు ఇస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: