ప్రస్తుత పరిస్థితులలో పవన్ కోరినా కోరకపోయినా ఎన్నికల టైమ్ కు చిరంజీవితో పాటు మెగా కుటుబసభ్యలు అంతా  ‘జనసేన’ ప్రచార రథం ఎక్కే అవకాశాలు రోజురోజుకి బాగా పెరిగి పోతున్నాయి అనివస్తున్న వార్తలు ఒకవిధంగా పవన్ కు ఊహించని సమస్యలు తెచ్చి పెడుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. లేటెస్ట్ గా పవన్ కోసం అబ్బాయి చరణ్ రంగంలోకి దిగి శ్రీకాకుళం జిల్లాలోను ఒకగ్రామాన్ని దత్తత తీసుకుంటానంటూ ప్రకటన ఇవ్వడమే కాకుండా తన బాబాయ్ పవన్ అడుగుజాడల్లో నడుస్తానని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.

నాగబాబు అయితే ‘జనసేన’ పార్టీ పెట్టినప్పట్నుంచి పవన్ కు అనుకాలంగా అవకాశం చిక్కినప్పుడల్లా కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. ఇదిచాలదు అన్నట్లుగా అల్లు అర్జున్ కూడ పవన్ పిలిస్తే చాలు ‘జనసేన’ తరుఫున ప్రచారం చేస్తాము అంటూ లీకులు ఇస్తున్నాడు. వీరందర్నీ మించి సాయిధరమ్ తేజ్ అయితే పవన్ పిలిస్తే సినిమాలు కూడ వదిలేస్తాను అంటూ ఇంటర్వ్యూలలో చెపుతున్నాడు. దీనితో ఈపరిస్తుతులను పరిశీలిస్తున్నవారు రాబోతున్న ఎన్నికల రణరంగంలో పవన్ సపోర్ట్ గా మెగా ఫ్యామిలీ టోటల్ గా దిగిపోవడం ఖాయం అని అంటున్నారు. 
Pawan Kalyan, on a one day hunger strike in Srikakulam over Uddanam Kidney issue
ఒకేసారి రంగంలోకి దిగకుండా అంచలంచలుగా మెగా కుటుంబ సభ్యులను ‘జనసేన’ లోకి పంపాలి అన్నది చిరంజీవి వ్యూహం అని టాక్. దీనితో రాబోతున్న 2019 ఎన్నికల్లో ‘జనసేన’ లో మెగాముద్ర చాలబలంగా ఉంటుంది అన్నప్రచారం జరుగుతోంది. మరి ఈముద్ర జనసేనానికి ప్లస్ అవుతుందా లేదా ‘ప్రజారాజ్యం 2’ ను తలపిస్తుందా అంటూ అప్పుడే కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారసత్వ రాజకీయాలపై తన ప్రజాపోరాట యాత్రలో తీవ్రమైన సెటైర్లు వేస్తున్న నేపధ్యంలో మెగా ఫ్యామిలీ వ్యూహాలకు లొంగిపోయి తన ‘జనసేన’ ను ఫ్యామిలీ పార్టీలా మార్చివేస్తాడా లేదంటే తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటాడా అన్నకోణంలో చర్చలు జరుగుతున్నాయి. 

ఇది ఇలా ఉండగా పవన్ ‘జనసేన’ కు టోటల్ సపోర్ట్ ఇస్తూ గతవారం విజయదశమి రోజున ప్రారంభం అయిన ‘ప్రైమ్ న్యూస్ 9’ న్యూస్ ఛానల్ రాబోతున్న రోజులలో పవన్ అనుకూల మీడియా సంస్థగా మారబోతోంది అన్నసంకేతాలు వస్తున్నాయి. పవన్ కు సపోర్ట్ ఇచ్చే న్యూస్ ఛానల్స్ సంఖ్య పెరుగుతూ ఉన్నా ఆఛానల్స్ కార్యక్రమాలు ఏనెట్ వర్క్ లో ప్రసారం అవుతున్నాయో ఎవరికీ తెలియని రహస్యంగా మారింది. దీనికితోడు పవన్ కు సపోర్ట్ ఇస్తున్న ఆంధ్రప్రభ పరిస్థితి కూడ అంతంతమాత్రమే. ఇలాంటి పాపులారిటీ లేని మీడియా సంస్థలను నమ్ముకుని పవన్ చేస్తున్న రాజకీయాలు ఎంతవరకు విజయవంతం అవుతాయో సమాధానాలు లేని ప్రశ్నలుగా మారుతున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: