‘అరవింద సమేత’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తన ఆలోచనలకు స్వస్తి చెప్పి అల్లు అర్జున్ త్రివిక్రమ్ చెప్పిన కథకు ఓకే చేయడంతో బన్నీ త్రివిక్రమ్ ల మూవీ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ అయింది. మాస్ మసాల సినిమాగా కాకుండా టోటల్ ఎంటర్ టైన్మెంట్ తో త్వరలో ప్రారంభం కాబోతున్న ఈమూవీకి బన్నీ త్రివిక్రమ్ ల మధ్య ఏర్పడ్డ పంతాలు అడ్డంకిగా మారుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 
Will New Offices Bring Luck to Bunny, Trivikram?
తెలుస్తున్న సమాచారం మేరకు అల్లు అర్జున్ ఈమూవీని తన తండ్రి గీత ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించాలని పట్టుపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ గతంలో అల్లు అర్జున్ తో నిర్మించిన ‘జులాయి’ సినిమా నుండి తీసిన సినిమాలలో చాలామటుకు తన సొంత నిర్మాణ సంస్థ హారికా హాసిని సంస్థ బ్యానర్ పై తీసిన నేపధ్యంలో ఈమూవీని కూడ హారికా హాసినీ బ్యానర్ తోనే తీస్తానని త్రివిక్రమ్ బన్నీకి స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. 
Allu Arjun at Wife Sneha Reddy Father Village
దీనితో బన్నీ త్రివిక్రమ్ ల మూవీకి లైన్ క్లియర్ అయినా నిర్మాత ఎవరు అన్న విషయం పై చిక్కులు ఏర్పడటంతో ఎవరికోసం ఎవరు సద్దుకుపోతారు అన్న ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలలో విపరీతంగా కనిపిస్తోంది. దీనికితోడు ‘అరవింద సమేత’ సక్సస్ అవ్వడంతో జోష్ మీద ఉన్న త్రివిక్రమ్ మాట నెగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు. 

ఇది ఇలా ఉండగా త్రివిక్రమ్ ఎందరో వాస్తు పండితుల సలహాలు తీసుకుని హారికా హాసినీ సంస్థ కోసం సుమారు నెలకు రెండున్నర లక్షల అద్దెతో తీసుకున్న ఆఫీసు బాగా కలిసి రావడంతో త్రివిక్రమ్ తన వేగాన్ని మరింత పెంచి తాను భాగస్వామిగా కొనసాగుతున్న హారికా సంస్థ తరపున  హను రాఘవపూడి శర్వానంద్ కాంబినేషన్ లో ఒక మూవీ నానీతో మరో ప్రాజెక్టు చేస్తూ బన్నీ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టాలి అన్న మాస్టర్ ప్లాన్ లో త్రివిక్రమ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో బన్నీ కండిషన్స్ కు త్రివిక్రమ్ ఒప్పుకుంటాడా అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: