బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కు తన ఆర్మీ బలంతో ఓ మీడియం రేంజ్ హీరో ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. కౌశల్ కు యాంటీగా ఎవరు కామెంట్ చేసినా సరే కౌశల్ ఆర్మీ వారిపై నెగటివ్ కామెంట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరో ఫ్యాన్స్ కు కౌశల్ ఆర్మీ తాకిడి తగిలిందని తెలుస్తుంది. 


షో నడుస్తున్న టైంలోనే నాచురల్ స్టార్ నాని మీద నెగటివ్ కామెంట్స్ చేస్తూ ప్రచారం చేసిన కౌశల్ ఆర్మీ లేటెస్ట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పెట్టుకున్నారు. నిన్న ప్రభాస్ బర్త్ డే కారణంగా వచ్చిన సాహో షేడ్స్ తో ప్రభాస్ సత్తా చాటాడు. అయితే ఆ మేకింగ్ వీడియో మీద కూడా కౌశల్ ఆర్మీ తమ ప్రతాపం చూపించింది.


ప్రభాస్ కన్నా కౌశల్ గ్రేట్ అన్నట్టుగా వారి వాదన ఉంది. తమ అభిమానుల నటుల కోసం ఫ్యాన్స్ గొడవపడటం కామనే కాని కౌశల్ ఆర్మీ మాత్రం స్టార్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ హంగామా చేస్తున్నారు. కౌశల్ ఆర్మీ చేస్తున్న ఈ చర్యలను కౌశల్ కలుగచేసుకుని ఆపేయిస్తే బెటర్ లేదంటే అందరి హీరోల ఫ్యాన్స్ అతనికి యాంటీ అయ్యే అవకాశం ఉంది.


ఇక ఛాన్స్ దొరికితే కౌశల్ పవన్ ను పొగుడుతూ ఉన్నాడు. ఆల్రెడీ మహేష్ బాబు వల్లే తాను ఇప్పుడిలా ఉన్నానని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను కవర్ చేసిన కౌశల్ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ను తన బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరి కౌశలేమో అలా తన అభిమానులేమో ఇలా వీళ్లు ఈ హడావిడి ఎప్పుడు తగ్గిస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: