పరుచూరి బ్రదర్స్ ను ప్రోత్సహించిన ఘనత నందమూరి తారక రామారావుది. అక్కడ నుండి మొదలైన వారి నందమూరి కుటుంబ అనుబంధంతో బాలకృష్ణకు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు డైలాగ్స్ సమకూర్చిన ఘనత పరుచూరి బ్రదర్స్ సొంతం. ఇప్పటికీ పరుచూరి బ్రదర్స్ తో నందమూరి హీరోల సాన్నిహిత్యం కొనసాగుతూనే ఉంది. 
అనుమానాలు పటాపంచలు
ఇలాంటి పరిస్థుతులలో ఈమధ్య జరిగిన ‘అరవింద సమేత’ సక్సస్ మీట్ లో ఒకే వేదికపై కనిపించిన బాలకృష్ణ జూనియర్ ల గురించి మాట్లాడుతూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ కు బాలకృష్ణ పై ఉన్న విపరీతమైన భయానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు పరుచూరి. తారక్ బాలయ్య మధ్య ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ పరుచూరి ఈవిషయాన్ని బయటపెట్టాడు. 
బాబాయ్ అంటే భయం
చాలాకాలం క్రితం పాలకొల్లులో జూనియర్ నటించిన ‘అల్లరి రాముడు’ చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య గురించి అప్పుడు తనతో చెప్పిన విషయాన్ని బయటపెట్టాడు పరుచూరి. ‘మీరు మా తాతగారిని ఎంతగా అభిమానిస్తారో అంతలా మా బాబాయ్ ని నేను అభిమానిస్తా’ అంటూ తనకు అప్పట్లోనే జూనియర్ ఈవిషయాన్ని చెప్పిన సందర్భం గుర్తుకు చేసుకుంటూ అయితే అప్పటికే జూనియర్ హీరోగా స్థిరపడిపోయినా తన బాబాయ్ బాలకృష్ణతో మాట్లాడటానికి చిన్న పిల్లవాడిలా భయ పడి పోయేవాడు అంటూ అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు పరుచూరి. 
 ముగ్గురి ముఖాల్లో విషాద ఛాయలు
అయితే ఇది అంతా తెలియక చాలామంది ఎదో ఊహించుకుని జూనియర్ బాలయ్యల మధ్య గ్యాప్ ఉంది అంటూ ప్రచారం చేస్తారని అయితే వాస్తవానికి వారిద్దరి మధ్య తండ్రి కొడుకుల కంటే ఎక్కువ సాన్నిహిత్యం ఉంది అన్న విషయం చాల కొద్ది మందికి మాత్రమే తెలిసిన నిజం అని అంటూ పరుచూరి గోపాలకృష్ణ జూనియర్ అభిమానులకు జోష్ ను ఇస్తున్నాడు. అయితే ఎప్పుడో జరిగిన ఈ సంఘటన పరుచూరికి కేవలం ‘అరవింద సమేత’ సక్సస్ మీట్ చూసిన తరువాత మాత్రమే గుర్తుకు రావడం ఆశ్చర్యం..


మరింత సమాచారం తెలుసుకోండి: