Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 11:46 pm IST

Menu &Sections

Search

దుమ్మురేపుతున్న 'సవ్యసాచి' ట్రైలర్!

దుమ్మురేపుతున్న 'సవ్యసాచి' ట్రైలర్!
దుమ్మురేపుతున్న 'సవ్యసాచి' ట్రైలర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు ఇండస్ట్రీలో ఈ సంవత్సరం అక్కినేని ఫ్యామిలీ దుమ్ముదులిపేస్తుంది.  మహానటి, రంగస్థలం, అభిమన్యుడు, యూటర్న్ చిత్రాలతో సమంత హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే..ఈ చిత్రాలన్ని మంచి హిట్ అయ్యాయి.  ఇక నాగ చైతన్య నటించిన  శైలజారెడ్డి అల్లుడు కూడా మంచి హిట్ టాక్ వచ్చింది.  ఇక అక్కినేని నాగార్జున నటించిన ‘దేవదాస్’ చిత్రం కూడా హిట్ అయ్యింది. తాజాగా ‘సవ్యసాచి’తో అక్కినేని నాగ చైతన్య మరోసారి అభిమానుల ముందుకు రాబోతున్నాడు. 

savyasachi-movie-naga-chaitanya-madhavan-nidhhi-ag

చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా 'సవ్యసాచి' సినిమా రూపొందింది. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను నవంబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు.  దసరా మంచి రోజు కాబట్టి ఆరోజు నుంచి ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. టీజర్ ఇప్పటికే విడుదల చేశారు. ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. విభిన్నమైన ఈ కథాంశం కొత్తగా వుండి అన్నివర్గాల ప్రేక్షకులను అలరించనున్నట్టు చెబుతున్నారు.