ఎన్టీఆర్ బయో పిక్ లో ఎన్టీఆర్ నటిస్తాడని జోరుగా వార్తలు వచ్చాయి.   సరిగ్గా రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ యూనిట్ కు సంబందించిన వారందరికీ ఎదురైన ప్రశ్న.. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో చేస్తున్నారా? అన్నది. చాలామంది నందమూరి ఫ్యాన్స్ తమ వాట్సప్ ల్లో ఈ వార్తను చలామణీ చేసారు. కొందరు తమ వాట్సప్ స్టేటస్ ల్లో ఈ పాయింట్ పెట్టుకున్నారు. నిర్మాతల్లో ఒకరు తనను అడిగిన సన్నిహితుడికి, ప్రస్తుతానికి ఇంకా ఆలోచనల్లోనే వుంది అని సమాధానం ఇచ్చారు.


ఇంతలా హడావుడి జరిగింది ఎన్టీఆర్ సినిమా ఎన్టీఆర్ చేస్తారనే విషయం. అయితే ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం వేరుగా వుంది. సినిమా దాదాపు పూర్తయిపోయిందని, ఇక ఈ దశలో ఎన్టీఆర్ కు సూటయ్యే పాత్రలేదని, అయితే బయోపిక్ లో ఎన్టీఆర్ ప్రమేయం ఏదో విధంగా వుంచే ఆలోచన అయితే జరుగుతోందని ఆ వర్గాలు వెల్లడించాయి.'బహుశా సినిమా ఓపెనింగ్ లో కొన్ని లైన్ల వ్యాఖ్యనం వుంది. అది ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లో వుంటే బాగుంటుందనే ప్రతిపాదన అయితే వుంది.



కానీ అది కూడా ఇంకా ఫైనల్ కాలేదు' అని ఆ వర్గాల వెల్లడించాయి. ఎన్టీఆర్ వాచకం, ఉచ్ఛారణ చాలా స్పష్టంగా వుంటుందన్న సంగతి తెలిసిందే.పైగా గంభీరంగా వుండే ఆ మాటతీరు ఇలాంటి సినిమాల వ్యాఖ్యానానికి చాలా అనువుగా వుంటుంది. అందుకే ఆ దిశగానే ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది. తాత ఎన్టీఆర్ సినిమాలో మనవడు ఎన్టీఆర్ ప్రమేయం వుంటే చాలు. నందమూరి అభిమానులు ఫుల్ హ్యాపీ ఫీలవుతారన్నది వాస్తవం.


మరింత సమాచారం తెలుసుకోండి: