ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా బయోపిక్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  బాలీవుడ్ లో సినీ నేపథ్యంలో  ప్రముఖ నటుడు సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా రాజ్ ఇరానీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ నటించిన ‘సంజూ’ఘనవిజయం సాధించింది.  ఇక తెలుగు లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా కీర్తి సురేష్ నటించిన ‘మహానటి’మంచి విజయం అందుకుంది.  ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ సంక్రాంతి కి రిలీజ్ కాబోతుంది.  అంతే కాదు తెలుగు లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మరికొంత మంది బయోపిక్ లు తీస్తున్నారు.
Related image
ఇక తమిళ నాట అమ్మగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న నటి, రాజకీయ నాయకురాలు జయలలిత జీవిత కథ ఆధారంగా ఒక బయోపిక్ తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే జయలలిత పాత్రలో చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా తమిళనాట ప్రజలందరికీ ‘అమ్మ’ అయిన నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నయనతార నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  దర్శకుడు లింగుస్వామి కూడా జయలలిత బయోపిక్ ను రూపొందించడానికి రెడీ అవుతున్నాడు.
Image result for జయలలిత
జయలలిత జీవితంలో ఎన్నో అనూహ్యమైన మలుపులు వున్నాయి .. ఆ మలుపుల్లో జయాలు .. అపజయాలు వున్నాయి. వాటన్నింటినీ కలుపుతూ లింగుస్వామి కథ సిద్ధం చేసుకుంటున్నాడట.  మరి ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే... జయలలిత అంటే నయనతారకు చాలా అభిమానం. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..జయలలితగారి పాత్రకు నేను సూట్‌ అవుతానో లేదో తెలియదు కానీ అవకాశం వస్తే మాత్రం చేయాలని ఉంది అని నయనతార పేర్కొన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: