అరవింద సమేత సినిమా ఇప్పడూ సూపర్ డూపర్ హిట్ అయి దూసుకు పోతుంది అయితే ఈ సినిమా కు సంభందించి ఒక ఆసక్తి కరమైన న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ముందు అల్లుఅర్జున్ దగ్గరికి వచ్చిందంటా... అయితే ఈ  సినిమాలో పాటలు కామెడీ లేకపోయే సరికే స్క్రిప్ట్ మార్చమని చెప్పినట్టు సమాచారం దీనితో త్రివిక్రమ్ చేసేదేమి లేక ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళాడు వెంటనే ఎన్టీఆర్ ఒప్పుకోవడం సినిమా తీసేయడం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం అన్ని జరిగిపోయినాయి. దీనితో సాధారణంగా బన్నీ భాద లొనే ఉంటాడు. 


అయితే ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ సాధించడం తో త్రివిక్రమ్ ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేశాడు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ... ప్రతి సినిమా ఒక ఆలోచనతోనే మొదలు పెడతాం. ఈ కథకు మొదట్టమొదటి ప్రేక్షకులు హీరోనే అవుతాడు. ఈ సినిమా మొదలు పెట్టడానికి, పూర్తి చేయడానికి, నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్లు దాటించడానికి సారథి ఎన్టీఆర్ మాత్రమే అని త్రివిక్రమ్ అన్నారు.


మొట్టమొదట ఈ కథ చెప్పినపుడు ఇందులో ఎంటర్టెన్మెంట్ ఏది? ఆరు పాటలేవి? నాలుగు ఫైట్లు ఏవి? ఇలాంటివేమీ అడగకుండా ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో అసలు ఫైట్సే లేవు... ఇందులో ఉన్నవి కేవలం ఎమోషనల్ సీన్స్ మాత్రమే... అని త్రివిక్రమ్ అన్నారు. ఇలాంటి ఫైట్స్ లేని, పాటల్లేని సినిమాను ఒప్పుకోవడానికి ధైర్యం చేసిన నటుడు ఎన్టీఆర్. ఆయన ధైర్యానికి ముందు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఆయన ఒప్పుకోకుంటే ఈ రోజు ఈ సినిమా లేదు, ఈ విజయం ఉండేది కాదేమో అని త్రివిక్రమ్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: