ఈ మద్య తెలుగు బుల్లితెరపై  విభిన్నమైన కాన్సెప్టులతో టీవీ షోలు ప్లాన్ వస్తున్నాయి. బాలీవుడ్ లో మంచి ఫామ్ లో కొనసాగుతున్న ‘బిగ్ బాస్ ’రియాల్టీ షో తెలుగులో రెండు సీజన్లు పూర్తయ్యాయి.  మొదటి సీజన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాల్గొంటే..రెండో సీజన్ లో నేచురల్ స్టార్ నాని పాల్గొన్నాడు.  అయితే బిగ్ బాస్ సీజన్ 1 ఎంతో హ్యాపీగా సాగినా..సీజన్ 2 మాత్రం కాస్త కాంట్రవర్సీతోనే సాగింది.  ఇక యాంకర్ ప్రదీప్ గురించి అందరికీ తెలిసిందే..తనదైన కామెడీ టైమింగ్ తో అద్భుతమైన వ్యాఖ్యానంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. 

యాంకర్ సుమా కనకాల అచ్చమైన కేరళా అమ్మాయి అయినా..అచ్చమైన తెలుగు భాషలో మాట్లాడి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనుసు దోచింది.  ఇండస్ట్రీలో టాప్ సినిమా ఈవెంట్లకు సుమా నే ఎక్కువగా యాంకరింగ్ చేస్తుంటారు.  తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో  ప్రదీప్ ‘పెళ్లచూపులు’రియాల్టీ షో వస్తుంది.   తాజాగా ఈ కార్యక్రమంపై ఎన్నో కాంట్రవర్సీలు మొదలయ్యాయి. ఆ మద్య తమిళంలో హీరో ఆర్యను పెట్టి ఈ షో చేశారు. అక్కడ కూడా ఎన్నో కాంట్రవర్సీలు చెలరేగాయి. 
Image result for pradeep pelli choopulu show
వారం వారం చిత్రవిచిత్రమైన గేమ్‌లు పెట్టి…. పార్టిసిపెంట్స్ ను ఎలిమినేట్ చేస్తూ పోవ‌డం ఈ కార్య‌క్ర‌మం ఉద్దేశం. చివ‌ర‌కు ఇద్ద‌రో ముగ్గురో మిగులుతారు. వారిలో ఒక‌రిని ప్ర‌దీప్‌ను పెళ్లి చేసుకుబోయే యువ‌తిగా సెలెక్ట్ చేస్తారు.  అయితే ఇది జరుగుతుంతో జరగదో తెలియదు కానీ..అందులో పాల్గొంటున్న అమ్మాయిలపై రక రకాల వాద‌న‌లు, ట్రోలింగ్స్ చేస్తున్నారు. 
Image result for pradeep pelli choopulu show
ఇప్పుడు ఈ కార్య‌క్ర‌మాన్ని వామ‌ప‌క్ష మ‌హిళా సంఘాలు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయి.   ప్రదీప్ పెళ్లి చూపుల కార్య‌క్ర‌మం నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. తిరుప‌తి నుంచి ప్రారంభ‌మైన ఈ నిర‌స‌న‌లు….త్వ‌ర‌లోనే రాష్ట్ర‌మంత‌టా పాకే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: