ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలకు ఓవర్సీస్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈక్రేజ్ వల్లనే ఇతడి సినిమాలు ఓవర్సీస్ రైట్స్ చాల భారీమొత్తాలకు అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థుతులలో మహేష్ మ్యానియాకు అమెరికాలో ఊహించని అవమానం జరగడం హాట్ న్యూస్ గా మారింది. 
ప్రతిష్టాత్మక చిత్రం... అదిరిపోయే లుక్
గతంలో టాలీవుడ్ స్టార్స్ అమెరికాలో ఏదైనా ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తే ఆకార్యక్రమంలో టాప్ హీరోను చూడటానికి అమెరికాలోని తెలుగువారు విపరీతమైన ఆసక్తిని కనపరిచే వారు. ఈ ఆసక్తిని గమనించి చాలామంది అమెరికాలో ఈవెంట్లు చేసినా ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసినా మంచి స్పందన వచ్చి ఆకార్యక్రమాలను నిర్వహించిన నిర్వాహకులకు విపరీతమైన ఆదాయం వచ్చేది.
వరుస లీకులు..
అయితే అనుకోకుండా ట్రెండ్ మారి ఇప్పుడు అమెరికాలోని తెలుగువారు మన టాప్ హీరోల పట్ల ఆసక్తి కనపరచడం బాగా తగ్గించి వేసారు. ఆమధ్య  ‘మా’ కోసం మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్న ఒక కార్యక్రమానికే రెస్పాన్స్ సరిగా లేదు. అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కొన్ని నెలల క్రితం తలపెట్టిన మ్యూజికల్ కన్సెర్ట్ కూడా ఫెయిలైంది. భారీ ఖర్చుతో పెద్ద ఆడిటోరియం తీసుకుని ఈవెంట్ చేస్తే ఆకార్యక్రమానికి వచ్చిన ఆక్యుపెన్సీ చూసి నిర్వాహకులు షాకయ్యారు. 
Mahesh Babu in Bharat Ane Nenu
ఇక లేటెస్ట్ గా మహేష్ బాబుతో ఒక సంస్థ ఏర్పాటు చేసిన ఫండ్ రైజింగ్ కార్యక్రమం ఆకార్యక్రమం మొదలు కాకుండానే క్యాన్సిల్ చేయడం షాకింగ్ గా మారింది. మొదట్లో ఈకార్యక్రమానికి 2 వేల డాలర్లు టికెట్ రేటు పెట్టారట. అయితే సరైన స్పందన రాకపోవడంతో రెండుసార్లు ఈ టిక్కెట్ రేటును తగ్గించడమే కాకుండా నాలుగో వంతు కన్నా తక్కువ రేటు పెట్టినా కూడా ఆశించిన స్థాయిలో టికెట్లు అమ్మకం అవ్వకపోవడంతో ఆకార్యక్రమాన్ని రద్దు చేసారు. దీనితో అమెరికాలోని తెలుగువారికి మన టాప్ హీరోలంటే మోజు తగ్గిందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: