మీ టూ ఉద్యమం ఇప్పుడు పక్కదారి తప్పుతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. . #మీటూ ఉద్యమాన్ని కొందరు పబ్లిసిటీ కోసం వాడుతున్నారంటూ కన్నడ నటి హర్షిక పూనాచా మీటూను దుర్వినియోగం చేస్తున్న హీరోయిన్లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేేశారు. కొందరు హీరోయిన్లు పెద్ద సినిమాల్లో అవకాశాలు, వాటి ద్వారా వచ్చే డబ్బు, విదేశీ టూర్లు, లగ్జరీ లైఫ్ కోసం ఎంటి నీచానికి పాల్పడతారో ఆమె బయట పెట్టారు. వారి పేర్లు బయట పెట్టకుండా ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉంటుందో కళ్లకుకట్టినట్లు చెప్పే ప్రయత్నం చేసింది.


మహిళలకు ప్రతి ఒక్కరూ గౌరవం ఇవ్వాలి, వారిని వేధింపులకు గురి చేయడం సరికాదు, వారి అనుమతి లేకుండా ఎలాంటి పనులు చేయకూడదు అని తన పేస్ బుక్ పోస్టు ద్వారా చెబుతూనే కొందరు హీరోయిన్లు తమ ఫెమినిటీని పబ్లిసిటీ కోసం ఎలా వాడుకుంటున్నారో వివరించే ప్రయత్నం చేశారు.తమ కెరీర్ తొలినాళ్లలో మంచి సినిమాలు, డబ్బు, సెలబ్రిటీ సర్కిల్, విదేశీ ప్రయాణాలు, విలాసవంతమైన జీవితం పొందడానికి ఈ మగాళ్లకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు.


ఇప్పుడేమో తమ పబ్లిసిటీ కోసం అదే మగాళ్లపై ఆరోపణలు చేస్తున్నారు. ఒకప్పుడు ఈ మగాళ్లతో చేతుల్లో చేయి వేసుకుని నవ్వుతూ నడిచిన సోకాల్డ్ హీరోయిన్లు ఇపుడు వారినే టార్గెట్ చేస్తున్నారని హర్షిక పూనాచా తెలిపారు. ఏ నటికైనా టాప్ పొజిషన్లో ఉన్న సూపర్ స్టార్ల మీద ఆరోపణలు చేసే దమ్ముందా? అంటూ హర్షిక పూనాచా ప్రశ్నించారు. అదే సమయంలో ఏ ఇండస్ట్రీకి స్టార్ హీరోయిన్ల నుంచి ఇలాంటి ఆరోపణలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: