చిరంజీవి నటించిన సినిమాలలో ‘గ్యాంగ్ లీడర్’ ఒకనాటి బ్లాక్ బస్టర్ హిట్. ఈసినిమా రీమేక్ లో తనకు నటించాలని ఉందని గతంలో చరణ్ ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ గానే చెప్పాడు. ఇలాంటి పరిస్థుతులలో అనుకోకుండా చరణ్ బోయపాటి మూవీ కథ తమకు తెలియకుండానే ‘గ్యాంగ్ లీడర్’ కథగా మారిపోయిందా అన్న అనుమానాలు కలుగుతున్నట్లు టాక్. 
Photos: Ram Charan’s film with Boyapati Srinu goes on floors
ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే ‘గ్యాంగ్ లీడర్’ కథలో హీరో చిరంజీవి తన పెద్దన్న మురళీమోహన్ ను చంపిన విలన్ పై పగ సాధించి చంపేస్తాడు. ఆసినిమాలో చిరంజీవి స్నేహితులు చిరంజీవి అన్నను చంపిన వ్యక్తి ఎవరో తెలిసినా చెప్పకుండా దాచేస్తారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చరణ్ బోయపాటి మూవీ కథలో కూడ ఇలాంటి ట్విస్ట్ ఉందని సమాచారం. 
Boyapati - Ram Charan's Is a Real Quickie!
చరణ్ అన్న ప్రశాంత్ ని విలన్ గ్యాంగ్ దారుణంగా చంపేస్తుంది. ఈవిషయం చరణ్ చిన్న అన్నయ్య ఆర్యన్ రాజేష్ కు తెలిసినా ఆవిషయం చరణ్ కు చెప్పకుండా జాగ్రత్త పడతాడు. అయితే చివరికి ఈవిషయాన్ని తెలుసుకున్న చరణ్ తన అన్నను చంపిన విలన్ ను భయంకరంగా చంపేస్తాడు. దీనితో ఇలా అనుకోకుండా చరణ్ బోయపాటిల మూవీకి అన్యాపదేశంగా ‘గ్యాంగ్ లీడర్’ స్టోరీ లైన్ మ్యాచ్ అయిపోయింది అని అంటున్నారు. 
Ram Charan trains hard to get in shape for his next film with Boyapati Srinu
ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కుంటున్న ఈ మూవీ నిర్మాణంలో భేదాభిప్రాయాలు వల్ల ఈమూవీ ఫోటోగ్రాఫర్ రిషీ పంజాబీ ఈమూవీ నుండి వాకౌట్ చేయడంతో ఇంకా 30 రోజులు చిత్రీకరణ మిగిలి ఉన్న ఈమూవీకి ఆర్ధూర్ విల్సన్ రంగప్రవేశం చేసాడు. ఇది ఇలా ఉండగా ఈమూవీ షూటింగ్ ను ఎట్టి పరిస్తుతులలోను నవంబర్ నెలాఖరులోగా పూర్తిచేసి తీరాలని చరణ్ బోయపాటికి అల్టిమేటమ్ ఇచ్చినట్లు టాక్. దీనితో ఈహడావిడి మధ్య ఈమూవీ విషయంలో ఎక్కడ ఏకాగ్రత తప్పుతుందో అన్న టెన్షన్ లో ఉన్నబోయపాటి ఈమూవీ టైటిల్ ను రకరకాల చర్చలు తరువాత ‘వినయ విధేయ రామ’ గా ఫైనల్ చేసి దీపావళి రోజున ప్రకటించ బోతున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: