మారిపోయిన పరిస్థుతులలో దీపావళి సరదాలను ‘హరిత దీపావళి’ గా మార్చుకుని పర్యావరణ హితకరంగా జరుపుకోవాలని జరుగుతున్న ఉద్యమం ప్రతి దీపావళికి వింటున్నదే అయినా ఈ హరిత దీపావళిలో కలిగే ఆనందాలను గుర్తించకుండా ఇంకా మనదేశంలో దీపావళి రోజున వందలాది కోట్ల రూపాయలను బాణాసంచా రూపంలో కాలిపోతున్న నేపధ్యంలో ఈ బాణాసంచా ధ్వనులు కాంతుల వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ ‘హరిత దీపావళి’ వాదాన్ని ‘గ్రీన్ దీపావళి’ గా పర్యావరణ ప్రేమికులు విపరీతంగా ప్రచారంలోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. 

ప్రస్తుతం బాణాసంచా కాల్చడమే దీపావళిగా మారిపోయిన నేపధ్యంలో విచ్చలవిడిగా రసాయనాలు వినియోగించి తయారుచేసిన బాణాసంచా వల్ల ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించి సామాజిక సంస్థల నుండి భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం వరకు దీపావళిని హరిత దీపావళిగా జరుపుకోమని పిలుపు ఇస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం సాధారణ గాలిలో ఉండే కాలుష్య కారకాలతో పోల్చితే 29 రెట్ల కాలుష్యం అధికంగా దీపావళి రోజున విష పూరితమైన గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి అన్న విషయం చాలామందికి తెలిసిన విషయమే అయినా ఎంత ప్రచారం జరిగినా ప్రజలు పట్టించుకునే స్థితిలో కనిపించడం లేదు. 
Stock foto af 'Smukke fyrværkeri på den sorte himmel baggrunden'
ఇక బాణాసంచా కాల్చడం వల్ల ఉత్పన్నమయ్యే ధ్వనికాలుష్యం మరో పెద్ద బెడద. బాణాసంచా తయారీలో రసాయనాల వాడకం పై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిమితులు విధించినా అమలుకాని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి కాలుష్య నియంత్రణ మండలి నియంత్రణ ప్రమాణాల ప్రకారం హానికలిగించని పరిమిత శబ్దం వచ్చేవిధంగా బాణాసంచా తయారుచేయమని పిలుపు ఇచ్చినా అవేమి పట్టించుకోకుండా తయారైన దీపావళి బాణాసంచా తయారులో మితిమీరి ఉపయోగిస్తున్న సల్ఫర్‌, మెగ్నీషియం, నైట్రేట్‌, జింక్‌, కాపర్‌, కాడ్మియం, సీసం వంటి రసాయన, లోహ కారకాల వినియోగం వల్ల కాలుష్య వాయువులు ప్రబలి అనేకమందికి శ్వాస, కిడ్నీ, నాడీ వ్యవస్థలకు సంబంధించిన సమస్యలు ఈదీపావళి సరదాలు వల్ల వస్తాయి అని చెప్పినా పట్టించుకునే నాధుడే లేడు.  
Crackers
అంతేకాకుండా దీపావళి బాణాసంచా శబ్దాలకు ఆరోజు వెలువడే వాయు కాలుష్యానికి దేశవ్యాప్తంగా వేలాది సంఖ్యలో పక్షులు, జంతువులు చనిపోయి జీవ వైవిధ్యానికి సైతం ప్రమాదం ఏర్పడుతోంది అన్న విషయాన్ని గుర్తించే వారు ఇప్పటికీ మనదేశంలో చాల తక్కువగానే ఉన్నారు. దీపావళి అనంతరం పేరుకుపోతున్న వందల కొద్ది టన్నుల వ్యర్థాలు దీర్ఘకాలంలో అనేక నష్టాలకు కారణమవుతున్నాయి అని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. దీపావళి అంటే బాణాసంచా కాల్చడమనే అభిప్రాయాన్ని అందరూ విడనాడి పర్యావరణ హితమైన వెలుగులు విరజిమ్మే బాణాసంచాను కాలుస్తూ హరిత దీపావళిగా జరుపుకోమని సుప్రీం కోర్టు పిలుపు ఇవ్వడమే కాకుండా దీపావళి బాణాసంచా సరదాలను కేవలం రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు పరిమితం చేసుకోమని పిలుపును ఇస్తూ 130 కోట్ల భారతీయులు ఆరోగ్యంగా జీవించే హక్కును కాలుష్యంతో కూడుకున్న దీపావళి బాణాసంచా హరించడం ఏమిటి అంటూ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నిస్తోంది. మారిన పరిస్థుతులతో పాటు సుప్రీం కోర్టు విధించిన ఆంక్షలు వల్ల దీపావళి సందర్భంగా జరిగే 20వేల కోట్ల రూపాయల బాణాసంచా అమ్మకాలు బాగా దెబ్బ తింటాయి అని కొంతమంది అంటూ ఉంటే మరికొందరు ప్రతి ఏడాది దీపావళి పండుగ ముందు జరిగే హడావిడిగానే ఈవిషయాన్ని గుర్తిస్తున్నారు. ఇన్ని సమస్యల మధ్య వస్తున్న ఈ వెలుగుల దీపావళి ‘హరిత దీపావళి’ గా మారుతుందో లేదో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: